
చిట్టినగర్‌: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చిట్టినగర్, రామాలయం సమీపంలో ఉన్న జగు పిల్ల రామారావు వీధి కొండ ప్రాంతంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పిల్ల లక్ష్మి అనే మహిళ ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. గోడ శిథిలాలు దిగువ భాగంలో ఉన్న ఇళ్లపై పడి ధ్వంసమయ్యాయి. ఇంట్లో సామగ్రి దెబ్బతిన్నాయి. ఆదివారం ఉదయం చిన్న చిన్న రాళ్లు పడుతుండటంతో గమనించిన దిగువ ప్రాంతంలోని నివాసితులు బయటకు రావడంతో ఒక్కసారిగా గోడ కూలింది. ఆ సమయంలో మూడు ఇళ్లల్లో ఉన్న వారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో చీపుళ్ల హైమ, పెరుమాళ్ల ఉష, అగురి లావణ్య, బండి రెడ్డి భవానికి చెందిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిరాశ్రయులైన తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




