Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 7 రోజుల వరుస నష్టాల తర్వాత కిందటి రోజు (ఆగస్ట్ 21) భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. ఇవాళ (ఆగస్ట్ 21) మళ్లీ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ ఫ్లాట్‌గా 77,530 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 24230 స్థాయిలో ట్రేడవుతోంది. అయితే మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ప్రముఖ మల్టీనేషనల్ పైపుల తయారీ కంపెనీ షేరు ధర భారీగా పెరిగింది. ఏకంగా 17 శాతానికిపైగా పెరగడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాల్ని అందిస్తోంది.అదే ప్రముఖ పైప్ తయారీ సంస్థ వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆ కంపెనీ చరిత్రలోనే తాజాగా అతిపెద్ద ఆర్డర్ దక్కడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో రూ. 2005.20 వద్ద ముగిసిన ఈ షేరు ధర ఇవాళ నేరుగా 8 శాతానికిపైగా లాభంతో రూ. 2175 వద్ద ఓపెన్ అవగా, తర్వాత ఇంకా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో 17 శాతానికిపైగా పెరిగి రూ. 2348.90 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కూడా కావడం విశేషం.ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 61.31 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 710 గా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ భారీగా పుంజుకుంటూ వస్తోంది. 5 రోజుల్లో ఏకంగా 27 శాతం పెరగ్గా, నెలలోనే 45 శాతం పెరిగింది. గత 6 నెలల వ్యవధిలో చూస్తే ఏకంగా 200 శాతం పెరగడం విశేషం. ఈ క్రమంలో లక్షను రూ. 3 లక్షలు చేసింది. గత ఐదేళ్లలో 2 వేల శాతానికిపైగా పెరిగింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని 20 లక్షలకుపైగా మలిచింది.Read Also: బాబు కోసం కార్పొరేట్ జాబ్ వదిలేసింది.. కట్ చేస్తే ఈజీగా లక్షల్లో ఆదాయం.. 'హోమ్‌స్టే' బిజినెస్ సీక్రెట్ ఇదే!అమెరికాలోని తమ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి పైపుల్ని సప్లై చేసేందుకు 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. మన కరెన్సీలో ఇది రూ. 17 వేల కోట్లకుపైనే ఉంటుంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌గా చెబుతున్నారు. ఈ వివరాల్ని కంపెనీ గురువారం రోజు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఇదే కొనుగోళ్లను పెంచేలా చేసింది. ఇంకా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 త్రైమాసికంలో మంచి లాభాల్ని నమోదు చేయడం కూడా స్టాక్ పుంజుకునేందుకు దోహదపడిందని నిపుణులు చెబుతున్నారు. క్యూ1లో నికర లాభం దాదాపు 3 రెట్లు పెరిగి రూ. 1047.88 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా భారీగా పెరిగి రూ. 4144.91 కోట్లకు చేరుకుంది.Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడులకు సిఫార్సు చేస్తున్నట్లు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉన్నందున ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.



