తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఎంతగా ఎదురుచూస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మూడు నెలల ముందుగానే టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంటుంది. నవంబర్‌లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బులు చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు.. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.READ ALSO తిరుమల: ఒక్క టికెట్‌తో ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం.. భక్తులకు సువర్ణావకాశం24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేయనున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.దర్శనానికి 22 గంటలుశ్రీవారి దర్శనానికి ఆదివారం రోజు 22 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారికంగా వెల్లడించింది. భక్తులు సంయమనం పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు స్వామివారిని 90,293 మంది భక్తులు దర్శించుకోగా.. 53,090 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.81 కోట్లు, లడ్డూల విక్రయాల ద్వారా రూ. 4.6 లక్షలు వచ్చినట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయని, ఆక్టోపస్ సర్కిల్ వరకు క్యూ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనం సుమారు 22 గంటల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు.



