
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tgsrtc 10 percent discount offer on return journey: ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తొంది. శ్రావణమాసం నుంచి వరసగా పండగలు వస్తుంటాయి. ఇక చాలా మంది పండగల సమయంలో చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాల్లో ఉన్నవారు తమ సొంతూర్లకు వెళ్తుంటారు. కొంత మంది తమ సొంత వాహనాలు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తారు. ఇక బస్సుల్లో ఉండే రద్దీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ వరుస పండగల వేళ బంపర్ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) బస్సు ప్రయాణికులు భారీ శుభవార్త చెప్పింది.
ప్రయాణికులు తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానం, రిటర్న్ జర్నీ ప్రయాణం టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే వీరి టికెట్ ధరల్లో ఏకంగా 10శాతం రాయితీ కల్పిస్తామని వెల్లడించింది. ఈ కొత్త స్కీమ్ ను బస్సు ప్రయాణికులు ఉపయోగించుకొవాలని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ముఖ్యంగా ప్రయాణికులకు రిటర్న్ జర్నీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు ఈ విధంగా స్కీమ్ తెచ్చామని అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఒక బుకింగ్, రెండు ప్రయాణాలు, ఎక్కువ మిగులు నినాదంతో ఆర్టీసీ ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఈ పదిశాతం రాయితీ అన్ని బస్సుల్లో ఈ రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక మహిళలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Read more: Konda Surekha: కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.! . సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం..
మహిళలు.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే పెద్ద పండగలైన వినాయక చవితి, దసరా, దీపావళి, మొదలైన పండగ వేళ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల్నికల్గజేసే చర్యల్లో భాగంగా ఈ 10 శాతం రాయితీని కల్పించినట్లు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





