
ఏఐ ప్లస్ పల్స్ 2 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 ఏఐ ప్లస్ నోవా 2 5జీ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999 ఏఐ ప్లస్ నోవా 2 నియో 5జీ 4GB+64GB వేరియంట్ ధర రూ. 14,999 Ai+ Phone Prices : కొత్త ఏఐ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏఐ ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. భారత మార్కెట్లో ఈ కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. మీరు కొత్త ఏఐ+ స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తుంటే మీరు రూ. 2వేల వరకు అదనంగా పేమెంట్ చేయాలి. మెమరీ, తయారీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఈ బ్రాండ్ ఫోన్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని కారణంగా అనేక ఇతర స్మార్ట్ఫోన్ తయారీదారులు కూడా తమ ఫోన్ల ధరలను పెంచారు. ఏఐ పల్స్ 2, నోవా 2 5జీ, నోవా 2 నియో 5జీ, నోవా 2 ప్రో 5జీ, నోవా 2 అల్ట్రా 5జీ వంటి ఎంట్రీ-లెవల్ మిడ్-రేంజ్ కేటగిరీ స్మార్ట్ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఏఐ ప్లస్ పల్స్ 2 ధర : ఈ ఏఐ ప్లస్ పల్స్ 2 ఫోన్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 నుంచి రూ.10,999కు, అంటే రూ. 1,000 పెరిగింది. అలాగే, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ (Ai+ Phone Prices) ధర రూ. 10,999 నుంచి రూ.11,499కు అంటే రూ. 500 పెరిగింది. ఈ ఫోన్ ధర రూ. 500 నుంచి రూ.1,000 వరకు పెరిగింది. ఏఐ ప్లస్ నోవా 2 : ఈ ఏఐ ప్లస్ నోవా 2 5జీ ధర రూ. 1,000 పెరిగింది. 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 నుంచి రూ. 13,999కి, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999 నుంచి రూ. 14,999కి, 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 నుంచి రూ.15,999కి పెరిగింది. మొత్తం మీద ఈ ఫోన్ ధర రూ. 1,000 పెరిగింది. Read Also : Jio vs Vi VIP Number : మీకు VIP మొబైల్ నంబర్ కావాలా? జియో, Vi యూజర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..! ఏఐ నియో నోవా 2 : ఈ నియో 5జీ ఫోన్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 13,999 నుంచి రూ. 14,999కి పెరిగింది. అలాగే, 4GB+128GB వేరియంట్ ధర రూ. 14,999 నుంచి రూ.15,999కి, 6GB+128GB వేరియంట్ ధర రూ. 15,999 నుంచి రూ.16,999కి పెరిగింది. ఈ ఫోన్ ధర మొత్తంగా ఒక్కో వేరియంట్ రూ. 1,000 పెరిగింది. ఏఐ ప్లస్ : ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 2వేలు (ధర రూ. 15,999 నుంచి రూ.17,999)కు పెరిగింది. అలాగే, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999 నుంచి రూ.19,999కు పెరిగింది. ఈ మోడళ్లపై మొత్తం రూ. 2వేలు పెరిగింది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా : ఈ 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 2వేలు (రూ. 18,999 నుంచి రూ.20,999)కు పెరిగింది. అలాగే, ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 2వేలు (రూ. 20,999 నుంచి రూ. 22,999)కు పెరిగింది.



