విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ప్రణయ్ తేజ అనే ఆరేళ్ల విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికి తను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విశాఖ వన్‌టౌన్‌లోని లిటిల్ గార్డెన్స్ అనే స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. లిటిన్ గార్డెన్స్ స్కూలులో ప్రణయ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో ప్రణయ్ తేజ.. క్లాస్ రూమ్‌లోనే కుప్పకూలాడు. ఈ విషయం తెలిసి స్కూలులోని మరో టీచర్ విద్యార్థికి సీపీఆర్ చేశారు. అనంతరం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ విద్యార్థికి ఈసీజీ సహా పలు పరీక్షలు చేసిన కేజీహెచ్ ఆస్పత్రి వైద్యులు.. చనిపోయినట్లు నిర్ధారించారు.ప్రణయ్ తేజ తల్లిదండ్రుల వాదనేంటి..మరోవైపు హోం వర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టడంతోనే ప్రణయ్ తేజ చనిపోయాడని అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టీచర్ కొట్టడంతోనే, భయపడిపోయి తమ కొడుకు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ సభ్యులు కేజీహెచ్ వద్ద, స్కూలు ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.వీడీయోలో ఏముందంటే..మరోవైపు ఈ ఘటనకు సంబంధించి క్లాస్ రూమ్ సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. వైరల్ అవుతున్న ఈ సీసీ ఫుటేజీ ప్రకారం.. ఓ లేడీ టీచర్ విద్యార్థుల హోం వర్క్ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రణయ్ తేజ వంతు వచ్చింది. అయితే టీచర్ వద్దకు వచ్చే సమయంలో ప్రణయ్ తేజ ఏడుస్తూ కనిపించాడు. వద్దు, వద్దు అంటూ టీచర్‌ను బతిమాలుతున్నట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. టీచర్ విద్యార్థి యూనిఫాం సవరించడం., చెంపపై ఓ దెబ్బ కొట్టడం అందులో రికార్డయ్యాయి. ఆ వెంటనే విద్యార్థి ముందుకు ఒరిగి టీచర్ మీద పడిపోవటం, ఆమె తనను నిలబెట్టే ప్రయత్నం చేయడం నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విశాఖ: యూకేజీ విద్యార్థి మృతి.. టీచర్ కొట్టడమే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ..మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూలు టీచర్ కొట్టడం వల్లనే విద్యార్థి చనిపోయాడా.. లేక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.





