నిద్రలేమి వల్ల కంటి కింద నలుపు వస్తుంది. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీంతో కంటి కింద నలుపు మాయం అవుతుంది.
రాత్రి పడుకునే సమయంలో దిండు వాడండి. దిండు వాడకపోవడం వల్ల ద్రవాలు కంటి కిందకు చేరుతాయి. దీంతో కంటి కింద ఉబ్బడం, కంటి కింద నలుపు వస్తుంది.
నీరు పుష్కలంగా తాగడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. కంటి కింద నలుపు మాయం అవుతుంది.
వాడిన గ్రీన్ టీ బ్యాగులను చల్లబరిచి కంటి కింద ఉంచండి. ఇవి రక్తప్రసరణనను మెరుగుపర్చి కంటి కింద నలుపును మాయం చేస్తాయి.
కీరదోస ముక్కలను నేరుగా కంటి కింద ఉంచండి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి అలసటను, కళ్ల నలుపును మాయం చేస్తాయి.
బంగాళదుంప రసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. బంగాళదుంప రసాన్ని దూది సాయంతో కంటి కింద అప్లై చేస్తే కంటి కింద నలుపు పోతుంది.
రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల గోరువెచ్చని బాదం నూనెని కంటి కింద అప్లై చేయండి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో నలుపు మాయం అవుతుంది.
తాజా కలబంద జెల్‌ను నేరుగా కంటి కింద అప్లై చేయండి. ఇందులోని పోషకాలు కంటి కింద నలుపును మాయం చేస్తాయి.
ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువగా మందు తాగడం వల్ల రక్తప్రసరణ సరిగా ఉండదు. దీంతో కంటి కింద చర్మం నల్లగా మారుతుంది. కాబట్టి ఆల్కాహాల్‌కు దూరంగా ఉండండి.




