పసుపులోని కర్కుమిన్ అనే యాంటీ ఇంఫ్లమేటరీ సమ్మేళనం మోకాళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మోకాళ్ల సమస్య ఉంటే పసుపు పాలు లేదా పసుపు టీ తాగడం మంచిది.
మోకాళ్ల దగ్గర వాపు, నొప్పి తగ్గించేందుకు ఆయిల్ మసాజ్ కూడా సహాయపడుతుంది. దీనికోసం కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా ఆవాల నూనె కలిపి మర్దన చేస్తే సరిపోతుంది.
మోకాళ్లలో వాపు, నొప్పి ఎక్కువగా ఉంటే ఐస్ ప్యాక్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ ప్యాక్‌ను శుభ్రమైన క్లాత్‌లో చుట్టి నొప్పి ఉన్నచోట కాసేపు ఉంచాలి. రెండు, మూడు గంటలకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది.
ఓ బకెట్ గోరువెచ్చని నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ వేసి కాళ్లు అందులో కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల కండరాలు బిగుసుకుపోవడం, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
మోకాళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడి బిగుతుదనం తగ్గించడంలో అల్లం టీ సహాయపడుతుంది. అందుకే మోకాళ్ల వాపు, నొప్పి ఉంటే ఈ అల్లం టీ తాగడం చాలా మంచిది.
మోకాళ్లలో వాపు, నొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మోకాళ్లపై ఒత్తిడి పడి సమస్య మరింత పెరుగుతుంది.
మోకాళ్లలో వాపు సమస్య ఉన్నపుడు మీ తల కంటే కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోండి. దీనివల్ల మోకాళ్ల దగ్గర ఫ్లూయిడ్స్ నిలిచిపోకుండా ఉంటాయి.
ఒకవేళ మీ మోకాళ్ల నొప్పులు ప్రారంభంలో ఉంటే ఈ చిట్కా పాటించొచ్చు. రెండు రోజుల లోపు మోకాళ్ల నొప్పులకు హీట్ ప్యాడ్ లేదా వేడి క్లాత్ ఉంచి మర్దన చేస్తే కండరాలు బిగుతుగా మారకుండా ఉంటాయి. నొప్పి కాస్త తగ్గుతుంది.
మోకాళ్ల వాపు, నొప్పి సమస్య ఉన్నపుడు వాటర్ ఎక్కువగా తాగాలి. అలాగే బెర్రీస్, గింజలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.




