మీ అక్క బతికి ఉన్నన్నిరోజులు నన్ను బాగా చూసుకుంది.. అయినా మీ అక్కని చంపినందుకు ఈ నారాయణ జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా.. అయినా నీకు మీ అక్క పిల్లలు అంటే ప్రేమ లేదా? అని తాయారు అంటుంది. ఇప్పుడు ఈ చంపుకోవడం లాంటివి వద్దు అని అంటుంది. మామయ్య.. మేం చిన్నప్పటి నుంచి ఏ దిక్కు లేకుండా బతికాం. మా అందరినీ చూసి పై నుంచి అమ్మ ఆత్మ ఎంత బాధ పడి ఉంటుందో అని పెద్ది అంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ కూడా లేదు.. ఇప్పుడు నాన్నకి దూరం చేస్తారా? అని మహా అడుగుతుంది. వీడు నాకు ప్రాణ భిక్ష పెట్టడం ఏంటి.. అని నారాయణ పైపైకి వెళ్తుంటాడు. మా అక్క చూసి మిమ్మల్ని.. మీ మొహం చూసి ఈ నారాయణను ఇప్పుడు వదిలేస్తున్నా.. ఈ పగ మాత్రం చల్లారలేదు.. నీ చావంటూ ఉంటే.. అది నా చేతుల్లోనే అని దుర్గ ప్రసాద్ అంటాడు. దీంతో నారాయణ గొడవకు వెళ్తుంటాడు. అందరూ కలిసి నారాయణను బయటకు తీసుకు వస్తారు. కారులో అందరూ హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు.కేరింగ్‌గా చూసుకున్న మహా.. కారులో కూర్చున్న నారాయణని కన్నా టచ్ చేస్తాడు. అబ్బ.. దెబ్బలు బాగా తగిలాయ్ రా అని అంటాడు. నీకు ఎలా ఉంది రా అన్ని కేశవ అడిగితే.. ఇవన్నీ నాకు అలవాటు అయ్యాయ్ కదరా అని చక్రి అంటాడు. ఇక దారిలో మెడికల్ షాప్ చూసి కారు ఆపండి అని మహా అంటుంది. చక్రి చేతిని పట్టుకుని ఆయింట్ మెంట్ రాస్తుంది. అమ్మ అని చక్రి అరుస్తుంటే.. మీరేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా? అని మహా అంటుంది. షర్ట్ బటన్స్ విప్పండి.. బ్యాక్ సైడ్, షోల్డర్ మీద రాస్తాను అని మహా అంటుంది. నాకు సిగ్గు అండి అంటూ మెలికలు తిరుగుతుంటాడు చక్రి.మళ్లీ వద్దాం.. వాళ్లని తిడదాం, కొడదాం అంటే మన వాళ్లు, మన చుట్టాలు అయిపోయారు.. అందుకే ఏం అనలేదు అని మహా అంటుంది. అంటే మళ్లీ మనం ఇక్కడకు రామా అని కన్నా బాధగా అంటాడు. ఇన్నాళ్లు అంటే మనకు చెప్పలేదు కాబట్టి రాలేదు.. ఇకపై ప్రతీ ఏడాది వద్దాం అని అంటాడు కేశవ. అది మన ఊరు.. మన గ్రామ దేవత.. అని పెద్ది అంటాడు. అన్నయ్య పెళ్లి కుదిరాక, పెళ్లి అయ్యాక మళ్లీ వద్దాం అని నారాయణ అంటాడు. దీంతో కన్నా కాస్త ఖుషీ అవుతాడు.భయపెట్టిన నారాయణ.. అప్పుడు ఇల్లు వచ్చిందా? అని కన్నా అంటాడు. లేదు రా మనమే ఇంటికి వచ్చాం అని చక్రి అంటాడు. లోపలకు వెళ్తుంటే.. నారాయణ పూనకం వచ్చినట్టుగా ఊగిపోతాడు. దీంతో మనీషా భయపడి పెద్దిని, చక్రిని మహా, కేశవని కన్నా పట్టుకుంటారు. అలా భయపెట్టకు.. చిన్న పిల్లలు భయపడుతున్నారు అని చక్రి అంటాడు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాం కదా అని అలా చేశా అని నారాయణ అంటాడు. ఇక అందరూ లోపలకు వెళ్తే నారాయణ మాత్రం తన సైకిల్ పట్టుకుని వైన్ షాప్‌కి వెళ్లిపోతాాడు.చక్రిని వద్దన్న కేశవ.. అన్నయ్య నేను బయటకు వెళ్లి వస్తాను అని అంటాడు కేశవ. ఎక్కడికి రా ఈ టైంలో అని మాధవ అడిగితే.. శైలు దగ్గరకు అని కేశవ అంటాడు. ఏరా .. నీ బిడ్డను చూసుకోవాలని ఆత్రుతగా ఉందా?.. అని చక్రి కామెడీ చేస్తాడు. నువ్వు సైలెంట్‌గా ఉండు రా అని కేశవ అంటాడు. జాగ్రత్త రా.. అసలే వాళ్లు కోపంతో ఉంటారు.. నువ్వేం గొడవలు పెట్టుకోకు అని అంటాడు మాధవ. సరే నేను కూడా వస్తాను ఆగరా అని చక్రి అంటే.. పోరా అని కేశవ వెళ్లిపోతాడు. కానీ ఆటోలో వెళ్తూ కేశవను ఫాలో అవుతుంటాడు చక్రి.కేశవను తిట్టిన వరాలు.. బయటే ఉండి శైలుకి కేశవ ఫోన్ చేస్తాడు. కానీ శైలు ఇంకా కడుపు, తండ్రి అని అంటూనే ఉంటుంది. దీంతో ఇంట్లోకి వచ్చేస్తాడు కేశవ. ఏంట్రా మా ఇంటికే వచ్చావ్ అని సురేష్ గాడు ఫైర్ అవుతాడు. నీ బిడ్డని చూసుకోడానికి వచ్చావా? నీకు ఎంత ధైర్యం రా అని తిడతాడు. ఏం బాబు.. మీ ఇంటికి వచ్చినప్పుడు పద్దతి, సంస్కారం అని ఏదేదో మాట్లాడారు.. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? అని వరాలు తిడుతుంది. మీకు మాత్రమే పరువు ఉంటుందా? మాకు ఉండదా? అని శేఖరం అంటాడు.మీ కూతురి తప్పు కూడా.. ఏంటి.. మీరంతా కలిసి మా కేశవ మీద పడ్డారు.. జరిగిన తప్పులో మావాడిదే మొత్తం ఉంటుందా? మీ కూతురు అంగీకారం లేకుండా ఇదంతా జరుగుతుందా.. జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉంటుంది.. అందుకు పెద్ద వాళ్లుగా మనమే దాన్ని సరిదిద్దాలి అని చక్రి అంటాడు. అంటే వీడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమంటావా? అని వరాలు ఫైర్ అవుతుంది. ఇలా తొందర పడితేనే పెళ్లి చేస్తారని వీడే సలహా ఇచ్చి ఉంటాడు అమ్మా అని సురేష్ అంటాడు. దీంతో కేశవకు మరింత కోపం వస్తుంది.కేశవను కొట్టిన శేఖరం.. కేశవ, సురేష్ గల్లా పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్తారు. అప్పుడు శైలు వచ్చి అడ్డుకుంటుంది. అసలు ఈ కడుపుకి నాకు ఏ సంబంధం లేదు అని కేశవ అంటాడు. దీంతో శేఖరంకి కోపం వస్తుంది. అంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది.. అని కొడతాడు. నా కూతురు వేరే వాళ్లతో తిరిగింది అంటున్నావా? నీకు సంబంధం లేదు అని అంటున్నావా? అని కేశవ కాలర్ పట్టుకుంటాడు శేఖరం. కేశవ మాత్రం సైలెంట్‌గానే ఉంటాడు. ఇక ఇంతలో శైలు అసలు విషయం చెప్పేస్తుంది. నాటకానికి స్వస్తి పలుకుతుంది.నిజం చెప్పేసిన శైలు.. అవును నాన్నా.. ఇందులో కేశవ తప్పేం లేదు.. ఇదంతా అబద్దం.. నేను అసలు ప్రెగ్నెంట్ నే కాను అని చెప్పేస్తుంది శైలు. ఏంటమ్మా అని శేఖరం.. ఏంటే అని వరాలు షాక్ అవుతుంది. హాస్పిటల్‌కి వెళ్లి స్కాన్ చేయించమన్నావ్ అని వరాలు అంటే.. అది కూడా అబద్దమే అని అంటుంది శైలు. ఇంత పెద్ద నింద ఎందుకు వేసుకున్నావ్ అమ్మా అని శేఖరం అంటాడు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తుండటం ఏం చేయాలో తెలీక అలా చెప్పేశా నాన్నా అని శైలు అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.





