అంతా నువ్వే చేసి ఇప్పుడు ఏం చేయనట్టు, తెలీనట్టు అడుగుతున్నావ్ అని శైలు ఆట పట్టిస్తుంది. అసలు ఇదెలా జరిగింది? అని కేశవ అంటే.. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మా వాళ్లు ముందే చెప్పార్రా నీ గురించి.. నిన్ను నమ్మొద్దు, నాకు సంబంధం లేదు అని మధ్యలోనే వదిలేస్తాడు అని.. కానీ నేనే నా కేశవ అలాంటి వాడు కాదని అన్నాను.. కానీ నువ్వేం చేశావ్.. వాళ్లే రైట్ అని నిరూపించావ్ అని కోపంగా ఉన్నట్టు ఫోన్ కట్ చేస్తుంది. దీంతో కేశవ అయోమయంలో పడిపోతాడు. ఇంతలో చక్రి వచ్చి కాబోయే తండ్రి అని ఆట పట్టిస్తుంది. అలా ఎలా.. ఇలా ఎలా.. ఇదంతా కల అంటూ నేనేం చేయలేదురా అని అంటాడు కేశవ. నువ్వేం చేయకపోతే పై నుంచి ఎవరైనా వచ్చి మంత్రం వేశార్రా.. ఊరుకోరా.. ఏం కాదు.. మనం వెళ్లిన తర్వాత మాట్లాడి పెళ్లి చేద్దాం.. ఇక మీ అత్త, మీ బామ్మర్ది గాడు కూడా ఏం చేయలేడు.. అని అంటాడు చక్రి. మరి మాట అని కేశవ అంటే.. ఇంకేం మాటలు రా.. వరాల మూట పుడుతుంటే అని చక్రి అంటాడు.నీకు నరకం చూపిస్తా.. కొడుతుంటే బాధగా ఉందా, నొప్పిగా ఉందా?.. నువ్వు మా అక్కని చంపేటప్పుడు కూడా మా అక్క ఇలానే బాధ పడి ఉంటుంది కదా.. ఇప్పుడు నీకు నరకం చూపిస్తా.. పైకి వెళ్లాక మా అక్క ఏ శిక్ష వేస్తుందో.. తన ఇష్టం.. నేను మాత్రం ఇక్కడ నీకు మరణ శిక్ష వేస్తాను.. నీకు ఎంత ధైర్యం ఉంటే.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నా ఊరికి వస్తావ్.. నిన్ను వదిలి పెడతాను అని ఎలా అనుకున్నావ్ రా.. వీడ్ని కొట్టండి.. నరకం అంటే ఏంటో చూపించిండి అని దుర్గా ప్రసాద్ ఆగ్రహిస్తాడు.నా కొడుకులు వస్తే.. ఇలా కట్టేసి కొడుతున్నారు.. మీరు మగాళ్లేనారా.. ఒకసారి కట్లు విప్పేసి చూడు.. నేనేంటో చూపిస్తా.. నన్ను మర్యాదగా ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడే వదిలేయండి.. నా కొడుకులకు ఈ విషయం తెలిస్తే మీ అందరినీ చంపేస్తారు.. ఒక్కొక్కరు చిరుతపులుల్లా వస్తారు.. అని నారాయణ అంటాడు. నీకు ఇంకా పొగరు తగ్గలేదు కదా.. అని ఇంకా కొట్టండి అంటూ రౌడీలకు చెబుతాడు దుర్గా ప్రసాద్. వాళ్లేమో నారాయణను చితకబాదేస్తుంటారు. ఇంకో వైపు కేశవ ఏమో అయోమయంలో ఉండిపోతాడు. శైలు గురించి తల్చుకుంటూ ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటాడు.ఇంటికి వెళ్లాక పెళ్లి గురించి.. ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతున్న కేశవ వద్దకు వచ్చి మాధవ మాట్లాడతాడు. ఏం ఆలోచిస్తున్నావ్ రా.. నిన్ను కొట్టే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.. తప్పు చేసింది నేనే అయినా ఎదురిస్తావ్.. అలాంటి నువ్వు తప్పు చేయడం ఏంట్రా.. సరే ఇంటికి వెళ్లాక వాళ్లతో మాట్లాడి మీ పెళ్లి చేసేద్దాం.. వాళ్లు నీ మీద కోపంగానే ఉంటారు.. కానీ మాట్లాడి చేద్దాం అని మాధవ అంటాడు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలా రా అని కేశవను అడుగుతాడు మాధవ. ఏం లేదు అన్నయ్య అని వెళ్లిపోతాడు కేశవ.కన్నా కౌంటర్లు.. త్వరగా ఇంటికి వెళ్లాలని అంతా బట్టలు సర్దుకుని ఉంటారు. ఇంతలో గాయత్రి, వినోద్ వచ్చి.. అప్పుడే వెళ్తారా? అందరం కలిసి వెళ్దాం కదా ఉండండి.. మీ మేనత్త ఇంటికి రావొచ్చు కదా అని అంటాడు వినోద్. ఆ కోపాలు, తాపాలు, పట్టింపులు ఎందుకు అని వినోద్ అంటాడు. ఆ విషయం వీళ్లకి కాదు మన వాళ్లకి చెప్పాలండి అని గాయత్రి అంటుంది. ఇంతలో తాయారు వస్తుంది. వీళ్లు వెళ్తున్నారట అని అంటుంది గాయత్రి. మంచిది వెళ్లండి.. దుర్ముహూర్తం వస్తుంది.. వెళ్లండి అని అంటుంది. తాయారు వెళ్లిపోవడంతో.. దుర్ముహుర్తం వెళ్లిపోయింది.. మనం పోదాం అని కన్నా కౌంటర్ వేస్తాడు.ఎత్తుకెళ్లిన విషయం చెప్పిన సతీష్.. కారులో అందరూ లగేజ్ పెడతారు. అంకుల్ జీ కహా హై అని మనీషా అడుగుతుంది. అరే అవును కదా.. కహా హై అని కన్నా అంటాడు. చీ.. అదే ఆయన ఎక్కడున్నాడు అని కన్నా అడుగుతాడు. అవును కదా.. మనం ఆయన గురించే మర్చిపోయామే అని చక్రి, కేశవ అంటాడు. బయటే ఉంటాడని అనుకున్నా అని మహా అంటుంది. ఇంతలో సతీష్ వచ్చి దుర్గ ప్రసాద్ ఎత్తుకెళ్లిన విషయాన్ని చెప్తాడు. దీంతో అందరూ కంగారుగా వెళ్తారు. ఇదే విషయాన్ని గాయత్రి తన తల్లి తాయారుకి చెప్తే.. మనకెందుకు అంటుంది.రౌడీలను కుమ్మేసిన నారాయణ కొడుకులు.. అప్పటికే నారాయణను ఆ రౌడీలు కొడుతుంటారు. ఒక్కసారిగా పెద్ది, కేశవ, చక్రి పులుల్లా మీద పడిపోతారు. ఆ రౌడీలను ఏరిపారేస్తారు. మా నాన్నని ఎందుకు కొడుతున్నారు అని మాధవ అడుగుతాడు. వీళ్లను పక్కకు లాగేసి కొట్టండ్రా అని అంటాడు దుర్గ ప్రసాద్. ఇక ఆ రౌడీలను చితక్కొట్టి పారిపోయేలా చేస్తారు పెద్ది, చక్రి, కేశవ. ఇంతలో ఊరి జనాలు కూడా వస్తారు. ఇక దుర్గా ప్రసాద్ కూడా కత్తి పట్టుకుని నారాయణను పొడిచేందుకు వస్తే.. చక్రి చేత్తో అడ్డుకుంటాడు. ఈ క్రమంలో చక్రి చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది.రక్త సంబంధం అని చెప్పిన నారాయణ.. అలా చక్రి రక్తం కారుతూ ఉంటుంది.. అసలు మీకు మాకు సంబంధం ఏంటి? మీరు ఎందుకు మా నాన్నని చంపాలని అనుకుంటున్నారు.. మీరు మమ్మల్ని కాపాడారు.. ఆ పెద్ద మనిషి.. ఈ పెద్ద మనిషి ఒకటేనా? అప్పుడున్న మంచితనం ఇప్పుడు ఏమైంది.. అని చక్రి అడుగుతాడు. మీకు, అతనికి ఉన్నది రక్త సంబంధం అని నారాయణ చెప్పేస్తాడు. ఇంతలో తాయారు వచ్చి విషయం అంతా చెబుతుంది. అతను మీ అమ్మకి తమ్ముడు, మీ మేనమామ అని నిజం చెప్పేస్తుంది. జైలుకి వెళ్లిన తర్వాత సంబంధాలు తెగిపోయాయ్ అని అంటుంది.పగ మీకు ప్రశాంతతను ఇచ్చిందా? ఇన్నేళ్లకు మళ్లీ ఊరికి తిరిగి రావడంతో పాత పగ గుర్తుకు వచ్చి ఉంటుంది అని తాయారు అంటుంది. ఎప్పుడో జరిగింది.. ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుని.. మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన వాడ్ని ఇలా చేయడం తప్పు కదా.. నలుగురికి న్యాయం చెప్పే మీరే ఇలా చేస్తారా? అని ఊరి జనాలు అడుగుతారు. మా అమ్మ ఫోటోని ఇంట్లో, ప్రేమను గుండెల్లో దాచుకున్న మీరు.. ఇలా పగను కూడా పెంచుకున్నారా? మీకు ఇది ప్రశాంతతను ఇచ్చిందా? అని మాధవ నిలదీస్తాడు. దీంతో దుర్గా ప్రసాాద్ సైలెంట్‌గా ఉండిపోతాడు. అంతటితో ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.





