నారాయణ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదా? అని పంతులు అడుగుతారు. రావడానికి ఎవరున్నారు అని తాయారు ఎగతాళి చేస్తుంది. అంతకు ముందే రుద్రాంబిక అమ్మవారి వద్ద తన బాధను చెప్పుకుంటుంది మహా. నేను ఆ ఇంటి కోడలిని కాదు..నేను చక్రిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు.. నీకు కూడా బంధాలే కావాలా? అమ్మా.. పెద్ది కోసం నేను ఇది చేయాలని అనుకుంటున్నా.. అని మహా అంటుంది. ఆ టైంకి గుడిలోని గంట మోగుతుంది. అదే అమ్మ వారి అంగీకారం అని మహా అనుకుంటంది. నిప్పుల చట్టీతో మహా వస్తుంది. అటు చూడండి అని మనీషా అంటుంది. అలా గాయత్రి, మహా ఇద్దరూ నిప్పుల చట్టీతో వస్తుంటారు. దీంతో నారాయణ సంబర పడతాడు. విజిల్స్ వేస్తాడు. ఇక ఎండలో అలా మహాలక్ష్మీ చెప్పులు లేకుండా నిప్పుల చట్టీతో నడుస్తుండటంతో చక్రి చూడలేకపోతాడు. బిందెతో నీళ్లు తీసుకు వచ్చి దారి అంతా కూడా తడుపుతూ ఉంటాడు. అలా కాసేపు సేవ చేస్తాడు చక్రి. చివరకు మహా, గాయత్రి ఇద్దరూ కూడా మూడు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అలా పూజా కూడా చివరకు పూర్తవుతుంది.శైలుకి డౌట్.. ఆటోలోంచి దిగేటప్పుడు.. దిగమ్మా.. రామ్మా అని అంటుంది శైలు. ఆరోగ్యం బాగానే ఉందా? నీకు ఏమైంది? అని శైలు అడుగుతుంది. నాకేం అవుతుందే అని వరాలు అంటుంది. ఎప్పుడూ కాళ్లు విరిచేస్తా.. చేతులు విరిచేస్తా.. చంపేస్తా అని నన్ను కొడుతూనే ఉంటావ్.. ఇప్పుడు పదమ్మా.. రామ్మా అని ప్రేమగా అంటున్నావ్.. అంటే ఏదో తేడా కొడుతోంది.. ఏదో చేస్తున్నారు.. చెప్పండి.. ఏం చేస్తున్నారు అని శైలు అడుగుతుంది. మేం ఏం చేస్తామే.. హోమం చేయడానికి వచ్చాం అని చెప్పాను కదా అని శైలుతో వరాలు అంటుంది.నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది.. లేదు.. మీరు అబద్దం చెబుతున్నారు.. ఏ గుడికి వెళ్లినా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.. కానీ ఇక్కడ నాకు ఎందుకో నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి.. నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది.. ఏదో తేడా కొడుతోంది.. ఏం చేస్తున్నారు.. చెప్పండని శైలు అడుగుతుంది. ఇక మాట్లడకు.. కొడతాను.. ఏం లేదు అని చెప్పాం కదా.. లోపలకి వెళ్లి దండం పెట్టుకుని హోమం చేయించాలి పదా అని అంటుంది వరాలు. అంతేనా? ఏం లేదు కదా? అని శైలు అడుగుతుంది. ఇంకో మాట మాట్లాడితే కొడతాను అని వరాలు అంటుంది.మళ్లీ వచ్చిన అనుమానం.. అమ్మా.. ఈ పెళ్లి ఎలాగైనా జరిగేలా చూడండి.. అని మొక్కుతుంది వరాలు. అమ్మా.. కేశవతో పెళ్లి జరిగేలా చూడమ్మా.. పెళ్లి అయ్యాక నేను 1116 సార్లు పొర్లు దండాలు పెడతాను అని శైలు మొక్కుకుంటుంది. ఇంతలో సైలెంట్‌గా వచ్చి వరాలు చెవిలో అన్నీ రెడీ అయ్యాయి.. దాన్ని తీసుకు రండి అని సురేష్ చెప్పి వెళ్లిపోతాడు. సురేష్‌ను అక్కడ చూసి మళ్లీ శైలుకి అనుమానం వస్తుంది. వాడు హోమం ఏర్పాట్లు చూసుకునేందుకు ముందుగా వచ్చాడు అని వరాలు, శేఖరం కవర్ చేస్తారు. కానీ శైలుకి మాత్రం ఏదో అనుమానం వస్తుంది.చక్రి ప్రేమను ఫీలైన మహా.. ఊర్లో అందరినీ ఐస్ గడ్డలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. కానీ దొరకవు. దీంతో నారాయణ ఇచ్చిన సలహాతో వైన్స్‌కి వెళ్తాడు. ఇక్కడ మహాలక్ష్మీ చేతులు కాలుతూ ఉంటాయి. వెంటనే ఆ ఐస్ గడ్డలను తీసి మహా చేతికి రాస్తుంటాడు. అలా మహా చేతులు కాస్త చల్లబడతాయి. ఇవన్నీ ఎక్కడ నుంచి తెచ్చావ్ రా అని అడిగితే.. ఊరంతా వెతికా, దొకలేదు.. నారాయణ ఇచ్చిన సలహాతో వైన్స్ నుంచి తెచ్చా అంటాడు చక్రి. అన్నయ్య నీళ్లు పోశాడు కాబట్టి నడవగలిగావ్ వదిన అని కన్నా అంటాడు. అవును రా అని చక్రి వైపు ప్రేమగా చూస్తుంది మహా. తన కోసం పడే చక్రి ఆరాటాన్ని, ప్రేమను మహా ఫీలైనట్టుగా కనిపిస్తోంది.పెళ్లి చేసుకుంటున్నావా? అన్నయ్య.. ఇంకో వైపు పెళ్లి గెటప్‌లో ఉన్న సురేష్ ఫ్రెండ్ ప్రకాష్‌ను చూసి.. హాయ్ అన్నయ్య.. మీరేంటి ఇక్కడున్నారు అన్నయ్య.. మీ పెళ్లా? అన్నయ్య.. పెళ్లి కూతురు ఎవరు అన్నయ్య అని అడుగుతూనే ఉంటుంది శైలు. దీంతో పక్కన ఉన్న సురేష్ ఫ్రెండ్స్ నవ్వుతుంటారు. రేయ్ ఏంట్రా ఇది అని ప్రకాష్ కూడా ఫీల్ అవుతాడు. ఆగరా నేను చెప్తాను అని శైలుని పక్కకు లాక్కెళ్తాడు సురేష్. ఎందుకు అలా పదే పదే పిలుస్తున్నావ్ అని అంటాడు. అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కాబట్టి పిలుస్తున్నా అని శైలు అంటుంది. అతడ్ని అలా పిలవొద్దు అని వరాలు అంటుంది. ఎందుకు అని శైలు ప్రశ్నిస్తుంది.నైవేద్యం చేసి పెట్టాలి.. కొత్త జంట అయితే కచ్చితంగా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలని పంతులు చెప్తాడు. మహా చేతికి గాయమైంది కదా అని చక్రి అంటే.. మీ ఇష్టం.. నైవేద్యం పెట్టకపోతే అమ్మ మిమ్మల్ని పొలిమేర దాటనివ్వదు అని అంటాడు పంతులు. అది ఎలా చేయాలి పంతులు గారు అని మహా అడుగుతుంది. ప్రాసెస్ అంతా చెప్తాడు. నేను సాయం చేస్తాలే అమ్మా అని పెద్ది అంటాడు. ఇక మహా చేతులకు చక్రి ఐస్‌తో మర్దనా చేస్తుంటాడు. మరి ఈ నైవేద్యం వండేటప్పుడు చక్రి ఎలాంటి సాయం చేస్తాడో చూడాలి.నిజం తెలియడంతో షాక్.. ఇంత వరకు అన్నయ్య అని పిలిచింది చాలు.. ఇక పిలవకు అని అంటుంది వరాలు. సరే కానీ నాకెందుకు.. పెళ్లి చేసుకుంటున్నాడా? లేచి పోయి వచ్చాడా? ఎవ్వరూ కనిపించడం లేదు.. పెళ్లి కూతురు ఎక్కడ? అని సురేష్‌ను శైలు అడుగుతుంది. నువ్వే పెళ్లి కూతురివి అమ్మా అని శేఖరం నిజం చెప్తాడు. జోక్ చేయకండి అంటూ ముందు పిచ్చిదానిలా నవ్వేస్తుంది శైలు. జోక్ కాదమ్మా.. సీరియస్‌గానే చెప్తున్నా అని అంటాడు శేఖరం. దీంతో ఒక్కసారిగా శైలు షాక్ అవుతుంది. అంతటితో ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.





