
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Live Frog Milk Tea Viral Video: సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచంగా మారిపోయింది.. ఇందులో ఎప్పుడు ఎలాంటి, దేనికి సంబంధించిన వీడియోలు, వార్తలు టెండర్ అవుతాయో ఊహించడం చాలా కష్టమని మనందరికీ తెలుసు.. అప్పుడప్పుడు ఇందులో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంటుంది.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఒక వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.. చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి తాను తాగే మిల్క్ టీ గ్లాసులోని ఏకంగా బతికి ఉన్న ఒక పెద్ద కప్పని వేసుకొని.. స్ట్రాతో ఆ టీని తాగుతూ ఉన్నట్లు వీడియో వైరల్ అవుతుంది..
ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.. చైనా వాళ్లు జంతువులను ఇష్టమొచ్చినట్లు చంపుకొని ఆహారంగా తీసుకుంటారని.. వారి అలవాట్లపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ వీడియోను @lolong___ అనే x యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో అప్పటినుంచి విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ వీడియోని ఏకంగా 1.2 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చైనీలు బతికున్న కప్పను పాల టీలో వేసుకుని.. దాన్ని రసాన్ని తాగుతారు.. అని క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో.. చాలామంది ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు వీళ్ళు మనుషులేనా? ఇంత దారుణమైన ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నారు? అని నెట్ రీజియన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నిజంగానే కప్ప టీ తాగుతారా? చైనాలో ఇలాంటి వింత టీలను తాగుతారా? అని చాలామంది ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా అబద్ధమని తేలింది.. ఆసియాలోని కొన్ని దేశాల్లో కప్పలను ఉడికించి.. సూప్ లాగా తినే అలవాటు ఉంటుంది.. కానీ ఇలా బతికున్న కప్పను టీలో వేసుకొని ప్రాణాలతో తాకేయడం అనేది చైనా తో పాటు థాయిలాండ్ లాంటి ఏ దేశాల్లో ఆహార సాంస్కృతి కాదని గూగుల్ సెర్చ్ లో తేలింది.. ఇదంతా కేవలం సోషల్ మీడియా వినియోగదారులను బురిడీ కొట్టించి.. వ్యూస్ సంపాదించుకోవడానికేనని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ వస్తున్నారు.
ఈ వీడియోను క్లియర్‌గా గమనించి మీరు కూడా చూస్తే.. అందులోని దొంగ నాటకం బట్టలు అవుతుంది.. ఒక వ్యక్తి కేవలం స్ట్రాను నోట్లో పెట్టుకుని టీ తాగుతున్నట్లు నటిస్తున్నాడు తప్ప.. స్ట్రా ద్వారా ఆ కప్ప ఉన్న నీరు ఒక్క చుక్క కూడా నోట్లోకి వెళ్లలేకపోవడం కూడా మీరు చూడొచ్చు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్ తో పాటు కామెంట్స్ కోసం ప్రజలు ఎంతకైనా దిగజారిపోతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కుతూ వస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



