నిమ్మరసంలోని విటమిన్ సి, బ్లీచింగ్ గుణాలు మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే కొద్దిగా నిమ్మరసం తీసుకుని మోకాళ్లపై బాగా రుద్దండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి.
బంగాళాదుంపలోని ఎంజైమ్స్ మోకాళ్లను తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీనికోసం బంగాళాదుంప ముక్కతో మోకాళ్లకు మర్దన చేయండి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
మోకాళ్ల దగ్గర ఏర్పడిన నల్లటి ట్యాన్ తొలగించడంలో పసుపు, పాలు సహాయపడతాయి. దీనికోసం పసుపులో కొద్దిగా పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు.
బేకింగ్ సోడా కూడా మోకాళ్ల నలుపు ఈజీగా తొలగిస్తుంది. దీనికోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.
అలోవెరా మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం తాజా అలోవెరాను మోకాళ్లకు రాసుకుని పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు.
కొబ్బరి నూనెలో కొద్దిగా చక్కెర కలిపి మోకాళ్లకు రాసుకోండి. ఇది నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి మోకాళ్ల నలుపు పోగొడుతుంది.
కీరదోస గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మోకాళ్లకు రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే మోకాళ్లు తెల్లగా మారుతాయి.
బేకింగ్ సోడాలో పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. పావుగంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది.
గ్రీన్ టీని తయారుచేసి చల్లారిన తర్వాత మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది.




