Mumbai Airhostess Crime Case : ముంబైలోని పవాయ్ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా ఓ పాతికేళ్ల ఎయిర్ హోస్టెస్ భర్తకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. అయితే తాంత్రిక పూజల చేస్తే అతడికి నయం అవుతుందంటూ.. ఆమెను భార్యను నమ్మించాడో యువకుడు. అది కూడా హిజ్రా రూపంలో వచ్చి నాటకం ఆడాడు. అది నమ్మిన భార్య పూజలకు అన్ని ఏర్పాట్లు చేయగా.. ఆమెనే హిప్నటైజ్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె స్పృహలోకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల వయసు కల్గిన అనిష్ షిండే అని వ్యక్తి హిజ్రా వేషధారణలో హవాయ్‌లోని ఓ నివాసం భవనంలోకి ప్రవేశించాడు. సెక్యూరిటీ గార్డును మోసం చేసి మరీ లోపలికి వెళ్లిన అథడు.. మూడో అంతస్తులోని పలు ఇళ్ల తలుపులు తట్టాడు. ఈక్రమంలోనే ఓ ఇంట్లో నివాసం ఉంటున్న.. 25 ఏళ్ల వయసు కల్గిన ఎయిర్ హోస్టెస్ తలుపులు తెరిచింది. వెంటనే ఇళ్లుకు దిష్టి తీసి, లోపల ఉన్న చెడు దృష్టిని తొలగిస్తానని ఆమెకు చెప్పాడు. బాధితురాలి భర్త ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందనే ఆశతో ఆమె నిందితుడిని ఇంట్లోకి రానిచ్చింది.ఆ తర్వాత నిందితుడు ఆమె తలపై నీళ్లు చల్లి, చేతిని ఉంచి పూజలు చేస్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలోనే ఆమెను హిప్నటైజ్ చేశాడు. ఆమె మైకంలోకి వెళ్లగానే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలికి స్పృహ రాగా.. గట్టిగా కేకలు వేయడంతో.. ఆమె వద్ద ఉన్న రూ. 200 నగదును తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత బాధితురాలు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ జోన్-3 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తా నలవాడే పర్యవేక్షణలో సీనియర్ ఇన్స్పెక్టర్ ఏఎస్ సావంత్, ఇన్స్పెక్టర్ సుశాంత్ బంద్గర్, సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ పాటిల్‌లతో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది.పవాయ్ భవనం నుంచి కల్వా వరకు ఉన్న ప్రయాణ మార్గంలోని 100కు పైగా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదైన కేవలం 4 గంటల వ్యవధిలోనే బుధవారం తెల్లవారుజామున కల్వాలోని ఒక మురికివాడలో అనిల్ షిండేను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అనిల్ షిండేపై అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు విచారణలో మాట్లాడుతూ.. తన కుటుంబం హిజ్రాల వేషధారణలో అడుక్కునే పని చేసేదని తెలిపాడు. గతంలో కూడా ఇతడు ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.




