
మిడ్జిల్: మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారు దుందుభి వాగులోంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికుల సమాచారం మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేశారు. మంగళవారం మధ్యాహ్నం జేసీబీతో ఇసుకను ట్రాక్టర్లలో నింపి అక్రమంగా రవాణా చేస్తుండగా వాహనాలను పట్టుకున్నట్లు ఆర్ఐ అంబిక తెలిపారు. వాహనాలను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు, రెవిన్యూ అధికారులను ఇసుక మాఫియా అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.