
కొత్తకోట గ్రామీణం: ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళుతున్న గద్వాల బస్సు డిపోకు చెందిన ఆర్టీసీ అదే దారిలో వస్తున్న లారీ వెనుక నుంచి బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





