
శివ్వంపేట, సెప్టెంబర్ 13 : వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిగుళ్లపల్లి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మట్టి వినాయకుల ప్రతిమలను పూజించడం ద్వారా భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా చేయూతనిచ్చిన వారమవుతామని అన్నారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణ గౌడ్, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, జెడ్పి కో ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు పవన్ గుప్తా, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు యాదగౌడ్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బుద్దుల బిక్షపతి, జగన్ రెడ్డి, వారాల శ్యామ్, కైఫ్, వంజరి రాహుల్, శ్రీకాంత్ రెడ్డి, పిట్ల కృష్ణ, మంగలి రమేష్, సుకుమార్, జంగం స్వామి, ముత్యాలు, గ్రామస్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






