
దేవనకొండ: ఎల్నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవాలని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని రైతులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. దేవనకొండ మండలం వెలమకురు సమీపంలోని కనక దీన్నే గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు మిరప, టమోటా సాగు చేశారు. శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో తన పిల్లలు, కుటుంబ సభ్యులతో గొర్రుకు తాడు సహాయంతో పంట పొలాల్లో పనులు చేపట్టారు. కాడెద్దులకు బాడుగలేక శుక్రవారం తనతో పాటు పిల్లలు కూడా తాడు లాగుతూ పనులు చేశారు. ఇప్పటికే వానలు లేక ఇబ్బందులు పడుతున్నామని సాగు ఖర్చులు లేక ఇలా పని చేస్తున్నామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




