
హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వెలసిన గాదిలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ముళ్లయ్య పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణమాసం రెండో గురువారం సందర్భంగా గూళ్యం, నిట్రవట్టి గ్రామానికి చెందిన కర్రెమ్మ వంశీయుల ఆధ్వర్యంలో వారి కుల దైవాలకు ప్రత్యేక అలంకరణ చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ఆవరణలో పూజారులు ప్రత్యేక భక్తి గీతాలు పాడారు. ఈ పూజలకు స్థానికులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




