
ఆళ్లగడ్డ గ్రామీణం : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఆర్. కృష్ణాపురం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. నాగుల చవితి సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలో పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలతో దీపాలు వెలిగించారు. పుట్టాలమ్మ, పరుశు రామలింగేశ్వర, లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





