
హాలహర్వి: తుంగభద్ర దిగువ కాల్వకు మూడు నెలల పాటు నీరు విడుదల చేసేందుకు తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తీర్మానం చేశారు. జలాశయంలో నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరడంతో మంగళవారం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు ఆడిటోరియంలో నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా దిగువ కాల్వకు ఈనెల 11 నుంచి నవంబర్ 10 వరకు 90 రోజుల పాటు నిత్యం 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు తీర్మానం చేశారు. నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదల ఉంటుందని తెలిపారు. నీటి విడుదల చేయడంతో కర్నూలు జిల్లా హాలహర్వి, హొళగుంద మండలాలకు చెందిన రైతులకు కొంత ఉపశమనం కలగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





