జ్యోత్స్నని సూరజ్ మోసం చేయడానికి, ఆమె పెళ్లి ఆగిపోవడానికి దీప, కార్తీక్‌లే కారణం అని శివన్నారాయణ అనడం కాదు.. దశరథ్ కూడా అదే మాట అనడంతో తల్లడిల్లిపోతారు దీప, కార్తీక్‌లు. ఈరోజు (సెప్టెంబర్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశారు. దీప... ఈ దశరథ్, సుమిత్రల కన్న కూతురని నేను ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనమ్మా.. ఎందుకంటే జ్యోత్స్నకి అంత అన్యాయం చేశారు’ అని అంటాడు దశరథ. ఈ నిజం బయటపడిన రోజు సుమిత్ర ఆనంద పడదు.. బాధపడుతుంది. ఎందుకంటే.. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావ్ అని తెలిస్తే.. తట్టుకోలేదు. అప్పుడు నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది’ అని అంటాడు దశరథ. ఆ మాటతో దీప.. ‘మీరు నా జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు బావుండాలనే నేను కోరుకునేది నాన్నా’ అని ప్రవచనం మొదలుపెట్టడంతో.. ‘నీతో నేను మాట్లాడలేనమ్మా’ అని దండం పెట్టేస్తాడు దశరథ. చూడు కార్తీక్.. నీ భార్యని తీసుకుని వెళ్లిపో.. అని అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దశరథ. దాంతో దీప.. ఏంటి బావా ఇదీ?? నాన్న నన్ను ఇంత పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నాడు అంటూ కన్నీటిపర్యంతం అవుతుంది.నా కోసం.. నా ప్రేమ కోసం నువ్వు వస్తావని తెలుసు సూరజ్.. పరిస్థితులే అలా చేయిస్తున్నాయి.. మామయ్య పరిస్థితే ఇలా ఉంటే.. అక్కడ జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉందో అని అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. జ్యోత్స్న.. సూరజ్ విసిరి కొట్టిన తాళిని తీసుకుని కన్నీళ్లతో అతని ఊహల్లోనే ఉంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. వచ్చావా సూరజ్.. నాకోసం వస్తావ్ అని తెలుసు.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు.. నా ప్రేమ నిన్ను ఎందుకు మార్చదు అని అంటుంది జ్యోత్స్న. ‘లేదు.. నన్ను మర్చిపో అని చెప్పడానికి వచ్చాను’ అని అంటాడు సూరజ్. ‘నన్ను దూరం పెట్టి.. నిన్ను నువ్వు మోసం చేసుకోకు’ అని అంటుంది జ్యోత్స్న. నువ్వు నాకోసం ఇలా బాధపడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు.. నా ప్రేమ ఇంకా నిజం అని ఎలా నమ్ముతున్నావ్? నీ అంతరాత్మ నీకు నిజం చెప్పడం లేదా? నేను మోసగాడ్ని అని’ అని అంటాడు సూరజ్. నువ్వు మేఘానివి కాదురా.. సూర్యుడివి.. నా అంతరాత్మ నాతోనే ఉంది.. అది నువ్వు మోసగాడివి అని చెప్పడం లేదు. నీతో నా జ్ణాపకాలు చాలానే ఉన్నాయి. నా అంతరాత్మ నీ గురించి నాతో ఏం చెప్పిందంటే.. నీ కుటుంబంపై వాడికున్న పగ నిజం అయినప్పుడు.. నీమీద వాడిపై ఉన్న ప్రేమ కూడా నిజమే అని చెప్పింది. రాజు కోసం ఎదురుచూసే రాణిలా ఎదురుచూస్తూనే ఉంటా. నా ఆశ చావదు. ఏదొక రాజు నీ సూరజ్ నీకోసం వస్తాడని చెప్పింది. ప్రేమలో ఉండే ఎమోషన్ ఎప్పుడూ మారదు. అవే విరహ వేదన.. అదే కన్నీళ్లు.. అవే ఎదురుచూపులు. ప్రేమించిన ఆడదాని హృదయం అందమైన ఆకాశం లాంటిది. వర్షించిపోవడానికి నువ్వు మేఘానివి కాదు.. సూర్యుడివి. మన బంధం అలాంటిదే నువ్వు ఎప్పటికే నాతోనే ఉంటావు.. నా అంతరాత్మ ఇదే చెప్పింది’ అని అంటుంది జ్యోత్స్న.ఒట్టేసి అబద్దం చెప్పని సూరజ్.. ‘ఇదిరా మన మధ్య ఉన్న ప్రేమా’ అయితే అది నిన్ను మోసం చేస్తుంది. నువ్వు నన్ను మర్చిపో.. అని అంటాడు సూరజ్. దాంతో జ్యోత్స్న.. ‘నీ మనసులో నేను లేనని నాపై ఒట్టేసి చెప్పరా? అని ఒట్టు పెట్టుకుంటుంది. అయితే సూరజ్.. జ్యోత్స్న కళ్లలోకి చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. చేయి తీసేస్తాడు. దాంతో జ్యోత్స్న.. ‘చేయి తీసేశావ్ ఏంటి? ఒట్టు పెట్టి అబద్దం చెప్తే నేను పోతాననా? నేను పోతే నీకేంటి? అని నువ్వు అనుకోలేవ్. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావ్.. నీ ప్రేమ నిజంరా.. కాదని చెప్పరా చూద్దాం’ అని అంటుంది జ్యోత్స్న. దాంతో సూరజ్.. ‘కాదని చెప్పలేను’ అని అంటాడు సూరజ్. ‘ఇదిరా నీలో ఉన్న ప్రేమ.. మనిద్దరికీ ఒకరిపై ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది.. మన ప్రేమని మనమే బతికించుకోవాలి అని అంటుంది జ్యోత్స్న. ఈ తాళి కట్టరా.. పాపం జ్యోత్స్న వెంటనే సూరజ్.. విసిరికొట్టి వెళ్లిపోయిన తాళిని తీసి.. ఇది నా మెడలో కట్టరా అని అంటుంది జ్యోత్స్న. ఇది నా మెడలో కడితే.. నేను నీ భార్యని అయిపోతాను.. కట్టరా’ అని అంటుంది జ్యోత్స్న. సూరజ్ మాత్రం షాక్‌లో ఉండి.. అలా చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావ్.. నా మెడలో కట్టు.. నువ్వు లేకుండా బతకడం.. ఊపిరితీసుకోకుండా ఉండటం రెండూ ఒక్కటే. నువ్వు లేకుండా బతకలేను.. నువ్వు నాకు కావాలి.. తాళి కట్టరా?? కట్టూ’ అంటూ తాళి పట్టుకుని కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది జ్యోత్స్న. కట్ చేస్తే.. ఎదురుగా శివన్నారాయణ, పారిజాతంలు ఉండి.. జ్యోత్సా.. జ్యోత్స్నా అని పిలుస్తారు. అంటే ఇదంతా జ్యోత్స్న కన్న కల అన్నమాట. సూరజ్ వచ్చినట్టుగా వచ్చినట్టుగా ఊహించుకుని అతనితో మాట్లాడిందన్నమాట. ఆ తరువాత సీన్ ఊహించిందే.. జ్యోత్స్న పడుతున్న బాధను చూసి తల్లడిల్లిపోతారు శివన్నారాయణ, పారిజాతం. జ్యోత్స్న వద్దకు కార్తీక్, దీప రావడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా మారుతుంది.





