జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది. కార్తీక్‌తో బంధాన్ని తెంపేసుకుని సూరజ్ వైపు గాలి మళ్లించింది. ఓ వైపు అతను వద్దూ అంటూనే.. అతని ప్రేమకోసం తపించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు (ఆగస్టు 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. కార్తీక్ ఇంటికి వచ్చిన జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్లడానికి క్యాబ్స్ కోసం చూస్తుంటుంది. ఎప్పటికీ క్యాబ్ బుక్ కాదు. దాంతో ఎలా వెళ్లాలీ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సెకండ్ హీరో వచ్చేస్తాడు బైక్ వేసుకుని. ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుందని బ్రదర్ చెప్పాడు కదా.. పైగా వర్షం పడేలా ఉంది.. రా లిఫ్ట్ ఇస్తాను.. అని అంటాడు సూరజ్. ‘నువ్వు ఎంత అడిగినా నేను రాను’ అని అంటుంది జ్యోత్స్న. ‘అబ్బా రా.. గొడవల్ని పక్కనపెట్టి ఎక్కు.. వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతాం’ అని బ్రతిమిలాడి జ్యోత్స్నని బైక్ ఎక్కించుకుంటాడు సూరజ్. ఇక అద్దంలో జ్యోత్స్నని చూస్తూ.. ‘ఎవరే.. ప్రేమని మాయన్నదీ’ అంటూ తెగ ప్రేమించేస్తూ సాంగ్ వేసుకుంటాడు సూరజ్. ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో థాంక్స్ అని అంటుంది జ్యోత్స్న. ఇట్స్ ఓకే కానీ.. చాలా కష్టపడుతున్నట్టున్నావ్ అని అంటాడు సూరజ్.వస్తువులు తిరిగి ఇచ్చేస్తే మనసులో ఉన్న ఇష్టం పోతుందా?? దేని గురించి మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న అంటే.. ‘నన్ను నమ్మించడానికి’? అని అంటాడు సూరజ్. ‘నిన్ను నమ్మించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావ్.. అని అంటాడు సూరజ్. ‘నేను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదు.. అలాగే నా మనసులో ఎవరికీ స్థానం లేదు.. రాదు’ అని అంటుంది జ్యోత్స్న. ‘సర్లే.. కనీసం నీ మనసులో నీకైనా స్థానం ఉందా? వస్తువులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ఇష్టం పోతుందా? అని అడుగుతాడు సూరజ్. మా బావపై ఉన్నది ప్రేమ కాదు.. పంతం.. అందుకే తిరిగి ఇచ్చేశా నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో నాకు అర్థం అవుతుందిరా.. ఎస్.. ఒకప్పుడు నాకు మా బావ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అందుకే ఆ వస్తువుల్ని దాచుకున్నా. ఇప్పుడు ఆ ఇష్టం పోయింది.. అవసరం లేదని అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మా బావపై ఉన్నది ప్రేమ కాదు పంతం అని అర్థమైంది. అలాంటప్పుడు మా బావ వస్తువులు నా దగ్గర ఎందుకు ఉండాలి? అందుకే.. తిరిగి ఇచ్చేశాను. నాకు ఒకటి చేయాలి అనిపించింది చేశాను. దీనికి ఒకరి ఇష్టాలతో సంబంధం లేదు. ఇది కేవలం నా నిర్ణయం. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో చేసుకో.నీ నిర్ణయం వల్ల ఎవరి జీవితాలు నాశనం కాకుండా ఉంటాయ్.. నా మనసులో ఎవరికీ స్థానం లేదని చెప్పడానికే ఈ పని చేశాను. నా కోసం నేను బతుకుతాను. ఇలా ఒంటరిగానే బతుకుతాను’ అని అంటుంది జ్యోత్స్న. వెరీ గుడ్.. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంకెవ్వరి జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి అని అంటాడు సూరజ్. ‘మాటలతో బాధపెట్డడం నీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.. థాంక్స్ ఫర్ ది లిఫ్ట్’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న. అయితే సూరజ్ మాత్రం.. పిల్ల దారిలోకి వచ్చేసింద్రోయ్ అన్నట్టుగా నవ్వుతూ ఉంటాడు. తెల్లవారగానే.. జ్యోత్స్న ఇంట్లో పంచాయితీ పెడతారు. సూరజ్‌ని పిలిచిన సుమిత్ర.. ‘ఏంటి బాబూ ఇదీ.. నీ వల్ల జ్యోత్స్న ఎంత ఇబ్బంది పడుతుందో నీకు అర్థం కావడం లేదు కానీ.. మాకు అర్థమౌతుంది’ అని అంటుంది.నీ వల్లే మా కూతురు ఇలా అయ్యింది.. ‘ఏంటీ నా వల్లా? నేనే చేశాను మేడమ్ అని సూరజ్ అంటే.. ‘నువ్వు పెళ్లి రిజెక్ట్ చేసినప్పటి నుంచీ.. మా కూతురు మాకే కొత్తగా కనిపిస్తుంది. తిండి లేదు.. నిద్ర లేదు.. రాత్రి ఏం చేసిందో చూశావ్ కదా.. అది మంచి విషయమే కావచ్చు కానీ.. అది పడే వేదన మేం చూడలేకపోతున్నాం బాబూ.. నువ్వే దాన్ని బాధపెడుతున్నావ్’ అని అంటుంది సుమిత్ర. మీరు అన్నదాన్ని ఒప్పుకుంటాను.. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని మీకు కూడా తెలుసు కదా.. వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నది మీరే కదా.. కానీ కార్తీక్ గారు దీప మెడలో తాళి కట్టిన తరువాత.. అతను జ్యోత్స్నకి ఎప్పటికీ భర్త కాలేరనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది కదా.. కానీ మీరెందుకు జ్యోత్స్న మనసుని మార్చలేకపోయారు? అని అడుగుతాడు. మీరు మనిషిని మార్చాలని.. నేను మనసుని మార్చాలని.. మా ప్రయత్నాలు మేం చేశాం బాబూ.. చివరికి ఇంట్లో నుంచి గెంటేస్తాం అని కూడా బెదిరించాం అని అంటుంది సుమిత్ర. ఆ మాటతో సూరజ్.. ‘ఇన్నాళ్లూ మీరు మనిషిని మార్చాలని ట్రై చేశారు.. ఆమె మనసుని మార్చడానికి ప్రయత్నించలేదు. అందుకే ఫెయిల్ అయ్యారు’ అని అంటాడు సూరజ్. దాంతో దీప, కార్తీక్‌లు నువ్వు అదే పని చేస్తున్నావ్ కదా సూరజ్.. మరెందుకు తనని పట్టించుకోనట్టు ప్రవర్తిస్తావ్.. మార్చడం అంటే ఇదేనా? తనతో మాట్లాడి కూడా మార్చొచ్చు కదా’ అని అంటారు. దాంతో సూరజ్.. ‘ఈరోజు జ్యోత్స్న బాధపడొచ్చు.. కానీ తన మనసు ఏంటో తాను అర్థం చేసుకున్న రోజున కళ్లలో కన్నీళ్లు రావు. నేను ఇప్పటికీ చెప్తున్నా.. జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టమే.జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బతుకుతా.. వినేసిన జ్యో తనని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా.. అందుకే తన మనసుని మార్చాలని అనుకుంటున్నా.. మార్పు మొదలైంది. ఈరోజు జ్యోత్స్నలో కనిపిస్తున్న బాధ కూడా మార్పే. నేను కోరుకున్న విధంగా తన మనసు మారినప్పుడు నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాకే అర్థమైపోయతుంది. జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బతికేటంత ప్రేమ నాలో ఉంది’ అని అంటాడు సూరజ్. అయితే సూరజ్ మాటల్ని మేడపై నుంచి వినేసి ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. తన పేరు చెప్తే చిందులు తొక్కే జ్యోత్స్న.. సూరజ్ తనపై కురిపిస్తున్న ప్రేమకి మౌనంగా ఉండిపోతుంది. ఇక రెస్టారెంట్ దక్కించుకునే విషయంలో మాలిని వర్సెస్ శివన్నారాయణల మధ్య హీట్ డిస్కషన్ నడిచింది.





