జ్యోత్స్న పెళ్లి మా బాధ్యత అంటూ ముక్కు మొహం తెలియని గొట్టంగాడ్ని తీసుకొచ్చి.. ఆమె గొంతుకోసిన దీప, కార్తీక్‌లకు సరైన రీతిలో బుద్ధి చెప్పాడు సూరజ్. అసలు జ్యోత్స్నని ఇంత మోసం చేయడానికి కారణం మీరేనంటూ.. అసలు దీపా, కార్తీక్‌లు లేకపోతే ఆ ఇంట్లోకి అడుగుపెట్టేవాడ్ని కాదంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు సూరజ్. ఇక తన మనవరాలి పెళ్లి పీటలపై ఆగిపోవడానికి.. సుమిత్ర హాస్పిటల్ పాలు కావడానికి కారణం దీప కార్తీక్‌లే కారణం అని వాళ్లని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు శివన్నారాయణ. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. దీప, కార్తీక్‌లు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. సూరజ్ వెళ్తూ వెళ్తూ.. తన చేసిన తప్పుల్లో మనల్ని ఎందుకు భాగం చేశాడో అర్థం కావడం లేదు’ అని అంటుంది దీప. ‘నీకు ఇంకా అర్థం కాలేదా? సూరజ్ పక్కా ప్లాన్‌తో మనల్ని ఇరికించేశాడు. తండ్రి చావుకి పగ తీర్చుకోవడానికి సూరజ్, మాలిని, దక్షణమూర్తి ముగ్గురూ కలిసే ప్లాన్ చేశారు. సూరజ్ ముందే గ్రౌండ్ వర్క్ చేశాడు. . ముందు నాకు నా ద్వారా నీకు పరిచయం అయ్యాడు.మనమే వాడు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చేశాం.. మనమే వాడి గురించి సరిగా తెలుసుకోకుండా.. సర్టిఫికేట్ ఇచ్చేశాం. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? వాడు చేశాడు. మా నాన్న నాకు ఆరోజే చెప్పారు.. ‘ఒకడు తన సామర్థ్యాన్ని తగ్గించుకుని.. వెళ్లే అవకాశం ఉన్నా.. వెళ్లిపోకుండా ఉన్నాడంటే.. వాడ్ని ఏదో ఒక శక్తి ఆపుతుంది’ అని. ఆ శక్తి వాడి పగే. వాడే కోటేశ్వరుడైనప్పుడు వాడికెందుకు డబ్బు, జీతం. సూరజ్ విషయంలో మనం ఎప్పటికప్పుడు మోసపోతున్నాం.. మంచితనమే మనిషికి నిజమైన శత్రువు. దాన్ని అడ్డుపెట్టుకుని అందర్నీ మోసం చేసి.. మనల్ని దోషుల్ని చేశాడు. మన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం చూస్తూ ఊరుకోం అని.. వాడు చాలా తెలివిగా మనల్ని మన ఫ్యామిలీకి దూరం చేశాడు.ఆ సూరజ్ గాడ్ని వదిలిపెట్టను దీపా.. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో వాడికి తెలియదు దీపా.. నేను వాడ్ని వదిలిపెట్టను. అత్త కారణంగా సూరజ్ తండ్రి చనిపోతే.. వాడి తండ్రి కారణంగా నా తల్లి అవిటిదైపోయింది. ఇది నేను భరించలేని విషయం. నా తల్లి కదల్లేని స్థితిలో ఉండటానికి కారణమైన వాళ్లని వదిలిపెట్టను’ అని అంటాడు కార్తీక్. అటు జ్యోత్స్న బాధ వర్ణణాతీతం. పీటలపై పెళ్లి ఆగిపోవడంతో జీవచ్ఛవంలా మిగిలిపోతుంది. ఆ పెళ్లి బట్టల్లోనే ఏడుస్తూ.. పెళ్లికి ముందు సూరజ్ ఇచ్చిన గిఫ్ట్‌ని తెరిచి చూస్తుంది. అందులో సూరజ్ కోసం జ్యోత్స్న కొన్న చైన్, ఐలవ్యూ చెప్తూ ఇచ్చిన వాడిపోయిన ఫ్లవర్లు ఉంటాయి. వాటిని చూసి ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. కుమిలికుమిలి ఏడ్చిన జ్యోత్స్న.. వాడే అబద్దం నా ప్రేమ నిజం అన్నీ తిరిగి ఇచ్చేశాను అని ఒక కార్డ్ కూడా పెడతాడు సూరజ్. దాన్ని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది జోత్స్న. ఇంతలో పారిజాతం వచ్చి.. ‘ఏడుస్తున్నావా? అని కన్నీళ్లు తుడుస్తుంది. ఇవి కన్నీళ్లు కాదు గ్రానీ.. నాలో ఉండిపోయిన బాధని బయటకు వదిలేస్తున్నా అని అంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న చేతిలో సూరజ్ ఇచ్చిన బాక్స్‌ని చూసి.. అన్నీ తిరిగి ఇచ్చేశాడా? వాడో పెద్ద మోసగాడే.. తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తాడు. సూరజ్ గాడు ఎప్పుడైతే మాలిని కొడుకు అని తెలిసిందో నా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. వాడే పెద్ద అబద్ధం అయినప్పుడు వాడి ప్రేమ నిజం ఎలా అవుతుంది’ అని అంటుంది పారిజాతం. వాడు ప్రేమ అబద్ధం కావచ్చు.. నా ప్రేమ నిజమే కదా అని అంటుంది జ్యోత్స్న. పాత జ్యోత్స్నలా మారవే.. ఆ సూరజ్‌ని మర్చిపో గాడిద గుడ్డు ప్రేమ.. వాడు నిన్ను కాదని.. తాళి నీ మొహంపై కొట్టి వెళ్లాడో.. అప్పుడే వాడ్ని గడ్డిపరకలా తీసిపారేయాలే.. ఇంకా వాడ్ని తలుచుకుని ఏడుస్తూ ఉన్నావా? వాడ్ని మర్చిపో’ అని తిట్టిపారేస్తుంది పారూ. మర్చిపోలేను గ్రానీ.. వాడు నన్ను వద్దనుకున్నాడు కానీ.. నేను వాడ్ని వద్దనుకోవడం లేదు అని అంటుంది జ్యోత్స్న. ‘నువ్వు నీలాగే ఉండు.. మారొద్దని చెప్పాను.. కానీ నువ్వు ఈరోజు ఏడుస్తున్నావంటే నువ్వు మారిపోవడం వల్లే. నువ్వు పాత జ్యోత్స్నలా ఉండకపోవడం వల్లే. ఇక ఏడుపు ఆపేసి సూరజ్‌ని మర్చిపో’ అని అంటుంది పారిజాతం. ‘మారలేను గ్రానీ.. చాలా దూరం వచ్చేశాను.. గొంగలి సీతాకోకచిలుక అవుతుందేమో కానీ.. సీతోకోకచిలుక గొంగలి పురుగు కాదు. నాలో పాత పారిజాతం నిద్రలేచిందీ.. ఆ సూరజ్ గాడ్నీ నాకు కొత్త ప్రేమని పరిచయం చేశాడు. ఇప్పుడు నువ్వు మారిపో.. వెనక్కి వచ్చేయ్ అని అంటున్నావ్.. కానీ నేను రాలేను గ్రానీ.. నా మనసు నా మాట వినే పరిస్థితుల్లో లేదు గ్రానీ.. అంటూ పారిజాతాన్ని పట్టుకుని కన్నీటిపర్యంతం అవుతుంది జ్యోత్స్న. ‘వాడు ఎంత దారుణం చేశాడే.. తండ్రి పగకోసం ఆడపిల్ల జీవితంతో వాడుకున్నాడు. వాడ్ని వదిలిపెట్టను. ఈ పారిజాతం మనవరాలితో పెట్టుకున్నాడు.. నాలో పాత పారిజాతం నిద్రలేవనంత వరకే.. అంతా ప్రశాంతంగా ఉండేది. నేను మనసు పెట్టానంటే ఈ సూరజ్ గాడు వాళ్ల అమ్మ కూడా నా ముందు పిల్ల బాతు బచ్చానే’ అంటూ రగిలిపోతుంది పారిజాతం. సూరజ్ ఆ లాకెట్లో కాదు.. నా మనసులో ఉన్నాడు.. తీసేయలేను అనంతరం జ్యోత్స్న చేతిలో ఉన్న లాకెట్‌ని విసిరికొట్టబోతుండగా.. జ్యోత్స్న అడ్డుకుంటుంది. సూరజ్ ఆ లాకెట్లో లేడు.. నా మనసులో ఉన్నాడు అంటూ గుండెలకు హత్తుకుంటుంది జ్యోత్స్న. ఒసేయ్ పిచ్చిదానా? వాళ్లు నిన్ను ఇలా కుమిలి కుమలి ఏడ్వాలనే ఇదంతా చేశారు.. నువ్వు ఇది కాదని మరో పెళ్లి చేసుకుంటే.. వాడి అహంపై దెబ్బ కొట్టొచ్చు అని అంటుంది పారిజాతం. దాంతో జ్యోత్స్న.. ‘నేను ఎవర్నీ ఏమీ చేయాలనుకోవడం లేదు.. నేను సూరజ్‌ని ప్రేమించాను. అసలు ప్రేమంటో ఏంటో తెలిసింది సూరజ్ వల్లే. ఇప్పుడు నేను ఇంక మారలేను’ అని అంటుంది జ్యోత్స్న. నీ ఉసురు వాడికి తగులుతుందే.. తగలాలి.. భోరున ఏడ్చిన పారూ దాంతో పారిజాతం.. ఆ దీప, కార్తీక్ గాడు కలిసి ఆ సూరజ్ గాడ్ని నీ జీవితంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లందరూ బాగానే ఉన్నారు. నువ్వు ఏమైపోతావో అని భయంగా ఉంది. నిన్ను చూస్తుంటే.. ఏమైపోతావో అని భయం వేస్తుంది. మీ అమ్మ హాస్పిటల్ పాలైంది. దేవుడి దయ వల్ల బయటపడింది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పాలౌతామోనని భయంగా ఉంది.. నిన్ను ఇలా చూడలేకపోతున్నామనే.. చాలా బాధగా ఉందే.. నువ్వు బాధపడుతుంటే వాడు అక్కడ సంతోషపడుతూ ఉంటాడే.. నీ కన్నీళ్ల ఉసురు ఆ సూరజ్ గాడికి ఖచ్చితంగా తలుగులుంది.. అని జ్యోత్స్నని పట్టుకుని ఏడ్చేస్తుంది పారూ.




