
బెంగుళూరు (చిత్రదుర్గం): పశ్చిమ కనుమలు, కేరళ, మహారాష్ట్రల్లో నిరవధికంగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని పలు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేరళలోని వయనాడు ప్రాంతంలో భారీ వర్షాలతో కావేరీ ఉపనది అయిన కపిలలో ప్రవాహం భారీగా ఉండడంతో దీనిపై ఉన్న శివనసముద్ర జలపాతం పర్యటకులను విశేషంగా అలరిస్తోంది. ఈ జలపాతాన్ని వీక్షించేందుకు రోజూ వేలాది మంది పర్యటకులు వస్తున్నారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న హోగేనకల్, శరావతి నదిపై ఉన్న జోగ్, ఘటప్రభ నదిపై ఉన్న గోకాక్ జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మలనాడులోని సాతోడ్డీ, విభూతి, చించోల్లి తదితర జలపాతాలు సైతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.