
కమాన్‌పూర్(సెంటినరీకాలనీ): అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ మెడికల్ అన్‌ఫిట్ చేసి, నెలకు కనీసం రెండు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆర్జీ-3 పరిధి ఓసీపీ-2 గని వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం కార్మికులతో కలిసి ర్యాలీగా వెళ్లి యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. భూగర్భ గనుల్లో పనిచేస్తూ తీవ్ర అనారోగ్యాలు, ప్రమాదాలకు గురవుతున్న కార్మికులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు. గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం మెడికల్ బోర్డులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇకపై నెలకు రెండు, మూడు బోర్డులు నిర్వహించి అర్హులైన వారందరినీ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు చిప్ప సురేష్, దేవ శ్రీనివాస్, పాశం శ్రీనివాస్‌రెడ్డి, వీరగోని సంతోష్‌గౌడ్, బర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





