ఐశ్వర్య ఫోన్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టా.. నేను తనను కాపాడుకుంటా.. అది నా బాధ్యత.. నువ్వు కంగారు పడకు స్వాతి ని అంటుంది ఇందు. ఇంకో వైపు వెంకీ ఫోన్ చేస్తున్నాడని నందు గాల్లోతేలిపోతుంది. నాకు తెలుసు రా నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు అని, ఇందు అక్క చెప్పినట్టుగా నువ్వే నాకు ఫోన్ చేస్తున్నావ్ చూడు అని నందు అనుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన నందు.. చెప్పు అని అంటుంది. రేపు నీతో మాట్లాడాలి.. వస్తావా? అని అడుగుతాడు వెంకీ. తమరు బిజీ కదా.. నేను కలిస్తే డిస్టర్బ్ అవుతుంది కదా.. మీకు ఒక్క నిమిషం కూడా వృథా కాకూడదు కదా అని నందు సెటైర్లు వేస్తుంది. అదేదో చిరాకులో ఉన్నా.. అందుకే అలా మాట్లాడా.. సారీ అని వెంకీ అంటాడు. నాకేం నీ సారి వద్దు.. నేను అలిగాను అని నందు అంటుంది. రేపు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.. కలుస్తావా? అని వెంకీ అంటాడు. లవ్ గురించి చెబుతాడేమో అని నందు సంబరపడుతూ ఓకే చెబుతుంది. సరే వస్తా.. గుడ్ నైట్ అని అంటుంది నందు.తను కాపాడకపోయి ఉంటే చనిపోయేవాడ్ని.. ఎందుకు రా మళ్లీ ఆ అమ్మాయిని కలుస్తా అని అంటున్నావ్ అని లక్ష్మీ అడుగుతుంది. నన్ను మర్చిపోదు.. అందుకే రేపు ఓ ప్లాన్ వేశా అని వెంకీ అంటాడు. ఆ అమ్మాయిని మర్చిపోయి ఉండగలవా అని లక్ష్మీ అడిగితే.. నాన్న కోసం ఉంటాను అమ్మా.. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం.. ఆ రోజు తను కాపాడకపోయి ఉంటే చనిపోయేవాడ్ని.. కానీ నాన్న కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు అని వెంకీ అంటాడు. నాన్నకి అర్థమయ్యేలా చెప్తాం అని లక్ష్మీ అంటాడు. మనకోసం ఒప్పుకుంటాడు కానీ సంతోషంగా ఉండలేడు కదమ్మా.. నాన్న కోసం నా ప్రేమను త్యాగం చేస్తా అని వెంకీ అంటాడు.అమ్మని, నిన్ను కలిపే బాధ్యత నాది ఒంటరిగా లక్కీ మందు కొడుతూ ఉంటాడు. రేయ్ నువ్వు ఇక్కడ ఉన్నావా.. నీ కోసం అంతా వెతుకుతున్నా కదరా అని రాజు అంటాడు. రేయ్ మామ.. నువ్వు ఏం చేస్తున్నావ్ రా.. నా పరువు అంతా తీస్తున్నావ్.. వద్దంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేశావ్.. నన్ను అవమానించాలని చూస్తున్నావా? అని లక్కీ అంటాడు. అలా కాదు రా.. నేనేం చేసినా నీ గురించే చేస్తా కదా.. నీ అమ్మని, నిన్ను కలిపే బాధ్యత నాది రా.. నన్ను నమ్ము రా.. మన తాగే ఈ మందు మీద ఒట్టు.. మీ ఇద్దరినీ కలుపుతాను అని రాజు అంటాడు.చెప్పేందుకు ప్రయత్నించిన ఇందు.. ఐశ్వర్య తన ఫోన్లోని జీపీఎస్ ట్రాకర్‌ను ఆఫ్ చేస్తుంది. చదువు రాని నీకు అన్ని తెలివి తేటలు ఉంటే..నాకెన్ని ఉండాలని ఐశ్వర్య అనుకుంటుంది. దీంతో ఇందు కంగారు పడుతుంది. సాయం కోసం రాజుకి ఫోన్ చేస్తుంది. కానీ రాజు మాత్రం అసలు ఇందు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పనివ్వడు.. ఎప్పుడూ నీ సమస్యలేనా? నీ కుటుంబం గురించేనా? తల బరువు ఎక్కింది.. అది దించుకోడానికి ఇక్కడ తాగడానికి వచ్చా.. ఫోన్ పెట్టేసేయ్ అని అంటాడు రాజు. దీంతో ఇందు చేసేదేం లేక వదిలేసి నందుని సాయం అడుగుతుంది.నీ మాటే వినదు కదా.. ఐశ్వర్య ప్రమాదంలో ఉంది, మనం కాపాడాలి అని ఇందు అంటుంది. అది నీ మాటే వినదు.. నిన్నే అందరి ముందు తిడుతుంది.. దాని గురించి నీకు ఎందుకు .. ఒకసారి ఇలా ఏదైనా జరిగితేనే దానికి బుద్ది వస్తుంది.. అని నందు అంటుంది. అలా అని వదిలేయలేం.. మన వాళ్లని అలా ఎలా వదిలేస్తాం.. మన మాట వినడం లేదు కదా అని గాలికి వదిలేయం కదా.. మన వాళ్లని కాపాడుకోవడం మన బాధ్యత అని ఇందు అంటుంది. నువ్వు నాకు సాయం చేస్తావా? లేదా? అని నందుపై ఇందు సీరియస్ అవుతుంది.కామన్ ఫ్రెండ్‌ను కనిపెట్టిన నందు.. సరే సాయం చేస్తా లే అని నందు అంటుంది. ఆ శశి గాడి కోసమే వెళ్లి ఉంటుంది.. ఇద్దరూ ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవడం అని ఇందు ఆలోచిస్తుంటుంది. ఆ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఉన్నారేమో సోషల్ మీడియాలో చూస్తా ఆగు అని రీనూ పేరుని వెతికి తీస్తుంది నందు. అవును రీనూ అంటే ఐశ్వర్య అక్క ఫ్రెండే, ఆమె ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలుసు అని స్వాతి సాయం చేస్తుంది. ఇక నందు, ఇందు కలిసి ఐశ్వర్య కోసం వెళ్తారు. స్వాతిని ఇంట్లోనే ఉండమని ఇందు చెబుతుంది.Screenshot 2026-08-11 085304





