
Aug 17 2026 8:23 PM | Updated on Aug 17 2026 9:11 PM
పురుషుల హాకీ ప్రపంచ కప్-2026లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన పూల్-డి గేమ్‌లో 2-4 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. నిక్ బందురాక్ గోల్‌తో ఇంగ్లండ్ బోణీ కొట్టినప్పటికీ.. తర్వాత భారత్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.
భారత కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడం, ఆపై దిల్ ప్రతీ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో హాఫ్‌టైమ్ సమయానికి భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకెండ్ హాఫ్ కథ తారుమారైంది. స్టువర్ట్ రష్‌మీర్, హెన్రీ క్రాఫ్ట్‌లు వరుస గోల్స్‌తో ఇంగ్లండ్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.చివరి నిమిషాల్లో నిక్ బందురాక్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసి ఇంగ్లండ్ విజయాన్ని (4-2) ఖాయం చేశాడు.
ఇక భారత జట్టు తమ ఆఖరి పూల్ మ్యాచ్‌లో ఆగస్టు 19న పాకిస్తాన్‌తో తలపడనుంది. క్వార్టర్స్ రేసులో ముందంజలో ఉండాలంటే పాక్‌పై భారత్ తప్పక భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?
రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు
కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?



