
హైదరాబాద్: క్యూర్ పరిధిలోని 20 డార్క్ స్టోర్లలో ‘టీజీ-సేఫ్’ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో స్టోర్లలో ఈ తనిఖీలు జరిగాయి. పరిశుభ్రత నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల స్టోరేజ్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా స్టోర్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన స్టోర్లకు నోటీసులు అందజేశారు. అనుమానాస్పద ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు, వాటిని పరీక్షించి ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





