
రేవంత్‌పై సుస్మిత సంచలన వ్యాఖ్యలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం Hyderabad Real Estate: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సృష్టిస్తున్న సంచలనాలు, భూముల ధరలకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, మౌలిక వసతుల విస్తరణ, మెరుగైన పెట్టుబడి అవకాశాల కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల విలువ ఊహకందని స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో స్థలాల కొనుగోలుకు దిగ్గజ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు పోటీపడుతుండటంతో ప్రతి వేలంలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. Konda Susmita: నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. పరకాల స్థానాన్ని వదిలేది లేదు.. మరోసారి కొండా సుస్మితా సంచలన కామెంట్స్ రాయదుర్గం వేలంలో నింగినంటిన ధరలు: ఈ క్రమంలో రాయదుర్గం(Hyderabad Real Estate) పరిధిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన భూముల బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి TGIIC వేలం నిర్వహించగా, ఎకరం ధర ఏకంగా రూ.264 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలో వ్యాపార విస్తరణకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పలు దిగ్గజ సంస్థలు వేలంలో తీవ్రంగా పోటీ పడటంతో ఈ స్థాయిలో ధర లభించినట్లు తెలుస్తోంది. పాత రికార్డులను తిరగరాసిన TGIIC వేలం: గతంలో ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.237 కోట్లు పలికిన రికార్డు ఉండగా, తాజా వేలం ద్వారా ఆ రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకే చోట రూ.264 కోట్ల రికార్డు ధర లభించడం నగర చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. ఐటీ కారిడార్‌లో ల్యాండ్ బ్యాంక్ పరిమితంగా ఉండటం, భవిష్యత్తులో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఇక్కడ ఉన్న అపార అవకాశాల వల్లే పెట్టుబడిదారులు భారీగా వ్యయం చేసేందుకు వెనుకాడటం లేదని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.





