
తాండూరు గ్రామీణం: సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్ ఓటర్లకు తాఖీదుల జారీ, సంబంధిత ధ్రువపత్రాల సేకరణ ప్రక్రియను ఈనెల 10లోగా పూర్తి చేయాలని తాండూరు ఎంపీడీవో విశ్వప్రసాద్ అధికారులను ఆదేశించారు. చెంగోలు, చింతామణి పట్నం, పర్వతాపూర్‌లో ఓటర్లకు తాఖీదుల జారీ ప్రక్రియను బుధవారం పరిశీలించారు. పది రకాల ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పించిన ఓటర్ల వివరాలు జాబితాలో పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. తాఖీదు అందుకున్న ఓటర్లు తమ గుర్తింపు ధ్రువపత్రాలు తప్పనిసరిగా అందించాలన్నారు. ఉప తహసీల్దార్ సందీప్, పంచాయతీ కార్యదర్శి శివానిరెడ్డి, మహేశ్వరి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





