
జవహర్‌నగర్, మేడ్చల్, న్యూస్‌టుడే: ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మేడ్చల్ జిల్లా టీపీటీఎల్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్‌నగర్‌లో రూపారెడ్డికి నివాళులర్పించారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు చట్టపరంగా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాప్రా మండల విద్యాధికారి అజామొయినుద్దీన్, కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్, గణేష్, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ మండల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. గిరిబాబు, రాధాక్రిష్ణ, నారాయణమూర్తి, లవకుమార్గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





