
జవహర్‌నగర్: మానసిక వైకల్యంతో బాధపడుతున్న యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ నగర్‌కు చెందిన వేముల అనూష కుమార్తె వేముల సాయి ప్రియ అలియాస్ గంగా (14), మాటలు సరిగా రాక మానసిక వైకల్యంతో బాధపడుతోంది. దీంతో బాధిత యువతి ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 17న అనూష కుమార్తెను ఇంట్లో వదిలి పనికి వెళ్లి, సాయంత్రం తిరిగొచ్చింది. అప్పటికి ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించింది. కుమార్తె కనిపించక పోవడంతో వెంటనే పలు ప్రాంతాల్లో వెదికినా ఆచూకీ లభించలేదు.ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




