ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. దీంతో ఎండ నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
ముఖానికి ఆయిల్ లేని ఉత్పత్తులు ఉపయోగించండి. దీని వల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవు. మొటిమలు తగ్గుతాయి.
రోజుకి రెండు సార్లు ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో కడగండి. దీంతో ముఖంపై జిడ్డు, మురికి తొలగుతుంది. మొటిమలు తగ్గుతాయి.
మొటిమలను చేతులతో తాకవద్దు. చేతులతో తాకడం వల్ల మొటిమలు తీవ్రం అవుతాయి. చేతులతో తాకడం వల్ల అందం కూడా దెబ్బతింటుంది.
నీరు ఎక్కువగా తాగడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి.
టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. టీ ట్రీ ఆయిల్ డైల్యూట్ చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
ముఖానికి చెమట పడితే వెంటనే కడగండి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల రిస్క్ తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు దిండు కవర్‌ను మార్చుకోండి. దిండు కవర్లు, టవల్స్‌ను మార్చడం వల్ల మొటిమలు రిస్క్ తగ్గుతుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. షుగరీ ఫుడ్, జంక్‌ఫుడ్ తినడం వల్ల మొటిమలు వస్తాయి.




