రోహిణి దగ్గర ఏటీఎం లాక్కోవడం తప్పు అని ఇంట్లో బాలు, మీనా, శ్రుతి, రవి అంతా అనుకుంటారు. ఇక ఇదే విషయాన్ని మనోజ్‌కి అర్థమయ్యేలా చెబుదాం అని డాబా మీదకు పిలుస్తారు. మీరు నాకు, అమ్మకి దూరం పెంచాలని చూస్తున్నారా? మీరు ఇలా నన్ను రెచ్చగొడితే.. నేను వెళ్లి అమ్మతో గొడవ పడాలా?.. అయినా అది వాళ్ల సమస్య.. వాళ్లు చూసుకుంటారు.. అమ్మ ఏం చేసినా రైటే.. దాని వెనక ఓ కారణం ఉంటుంది.. ఆ కారణం తెలుసుకునే స్థాయికి మీరు ఎదగలేదు.. మీకు అంత బుద్ది రాలేదు అని మనోజ్ అంటాడు. నీకు బుద్ది చెప్పాలని పిలిస్తే.. మాకే బుద్ది లేదని అంటావా? చదువుకున్న మూర్ఖుడివిరా నువ్వు.. నీకు, అమ్మకి దూరం పెంచాలనే ఉద్దేశం లేదు.. కానీ నువ్వు మాత్రం ఎక్కడి దాకో వెళ్లి ఆలోచిస్తున్నావ్.. నువ్వు నా కళ్ల ముందు ఉండొద్దురా వెళ్లిపో అని అంటాడు బాలు. కానీ మనోజ్ వెళ్లడు. దీంతో అక్కడే ఉన్న టైర్‌ని తీసుకుని మనోజ్ నెత్తి మీద వేయాలని బాలు చూస్తాడు. దీంతో కంగారు పడి కిందకు పారిపోతాడు మనోజ్. దీంతో అందరూ నవ్వుకుంటారు.అమ్మ కళ్లు తెరిపించే ఐడియా ఈ మూర్ఖుడ్ని మార్చలేం అని మనకు తెలిసిందే కదా అని బాలు అనుకుంటారు. వదిలేయండి అని మీనా అంటే.. వదిలేయ లేను.. అన్నదమ్ముల బంధం అని ఉంది కదా అని బాలు అంటాడు. మీరిద్దరి థాట్స్ ఒకేలా ఉంటాయి.. ఒకరి మాట ఇంకొకరు వింటారు కదా.. మరి మనోజ్ ఎందుకు అలా ఉన్నాడు.. మనోజ్‌ని ఎక్కడి నుంచైనా దత్తత తెచ్చుకున్నారా? అని శ్రుతి కామెడీ చేస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి బామ్మ మాట బంగారు మూట.. వాడికి అమ్మ మాట వజ్రాల మూట అని రవి అంటాడు. అమ్మ కళ్లు తెరిపించే ఐడియా వచ్చిందని బాలు అంటాడు.ఏటీఎం కార్డ్ తీసుకుంది ఉదయాన్నే బాలు పంచాయితీ పెడతాడు. అందరినీ తన స్టైల్లో పిలుస్తాడు. ఏమైంద్రా.. ఎందుకు పిలుస్తున్నావ్ రా అని అడుగుతుంది ప్రభావతి. ఏమైంది రా బాలు అని అడుగుతాడు సత్యం. అందరి కార్డులు తీసి ఇందులో వేయండి.. ఇది అమ్మ కోసమే.. రోహిణి కష్టార్జితాన్ని అమ్మ తీసుకోవాలని చూస్తోంది.. తన ఏటీఎం కార్డ్ తీసుకుంది అని చెబుతాడు బాలు. ఇదంతా నిజమా? ఎందుకు తీసుకున్నావ్ అని అడుగుతాడు సత్యం. డబ్బుల కోసం కాదు.. లెక్కల కోసం.. అది ఇంకా మన షాపులో ఎన్ని నొక్కిందో అని బ్యాలెన్స్ చెక్ చేయడానికి తీసుకున్నా అని ప్రభావతి అంటుంది.కోట్లకు కోట్లే మోసపోయాం.. రోహిణి తనంతట తాను ఇస్తే తప్పు లేదు కానీ.. నువ్వు తీసుకోవడం ఏంటి? అని సత్యం ఫైర్ అవుతాడు. అలా తీసుకున్నా తప్పే అని శ్రుతి అంటుంది. నీకేం తెలీదు.. ఇందులో దూరకు అని ప్రభావతి అంటుంది. తనకేం తెలీదు.. అన్నీ తెలుసు అని సత్యం అంటాడు. రేయ్ మనోజ్ నువ్వేం మాట్లాడవేంట్రా.. అమ్మకి అన్నీ తెలుసు.. కోట్లకు కోట్లే మోసపోయాం.. ఈ కార్డు ఓ లెక్కా.. అందులో ఏం ఉండదు అని మనోజ్ అంటాడు. ఇలా చేయడం తప్పు అని మీనా అంటుంది.నా అభిప్రాయం గురించి ఎవ్వరూ అడగరా అలా కార్డు తీసుకోవడం నాక్కూడా నచ్చలేదు అని బాలు, శ్రుతి, రవి అంటారు. మరి నీ అభిప్రాయం రా అని మనోజ్‌ని అడిగితే.. అమ్మకి నమ్మితే ఎలా చేయాలో తెలుసు.. నమ్మక ద్రోహం, మోసం చేస్తే ఏం చేయాలో కూడా తెలుసు.. నాకే లేని అభ్యంతరం మీకు ఎందుకు రా అని మనోజ్ అంటాడు. దీంతో అంతా షాక్ అవుతారు. ఇక్కడ నా అభిప్రాయం గురించి ఎవ్వరూ అడగరా? అని రోహిణి అంటుంది. అమ్మా.. చెప్పండమ్మా.. మీ అమూల్యమైన అభిప్రాయం గురించి అని బాలు వెటకారంగా అంటాడు.మా కాపురంలో మంటపెట్టి అత్తయ్య గారు చేసింది కరెక్ట్.. ఇకపై నా సంసాదన అంతా అత్తయ్య గారికే ఇస్తా.. ఆ కార్డు కూడా నా ఇష్టపూర్వకంగానే ఇచ్చా.. నా ఖర్చులకి కూడా అత్తయ్య గారినే అడిగి తీసుకుంటా.. బాలు మా కాపురంలో చిచ్చు పెట్టి.. మంటపెట్టి చలి కాచుకుంటున్నాడు అని రోహిణి అంటుంది. ఆ మాటలకు బాలుతో సహా అంతా షాక్ అవుతారు. చూశావా మీనా.. చివరకు ఏం అంటోందో అని బాలు అంటాడు. మంచికి పోతే చెడు ఎదురైనట్టు, మంచి చేయబోతే అదే మన పీకకు చుట్టుకోవడం అంటే ఇదే అని అర్థమైందా? అని మీనా అంటుంది.నీకు అయినా గుజ్జు అందని నిరూపించుకున్నావ్ అమ్మా రోహిణి మాటలతో బాలు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంటాడు. దాని చిలక పలుకుల గురించి నాకు తెలీదా.. ఈ వేలెడం లేని కార్డులో వేలు కూడా ఉండవు.. అందుకే ఇస్తోందని ప్రభావతి అంటుంది. నీకు అయినా గుజ్జు అందని నిరూపించుకున్నావ్ అమ్మా అని బాలు అంటాడు. గాలి కనిపిస్తోంది.. గాలి గాలిలా ఉంది అంటూ బాలు కాస్త తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో మా ఆయనకు ఏదో అయింది.. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదండి అని బాలుని తీసుకు వెళ్తుంది మీనా.త్రిబుల్ రైడింగ్‌తో దొరికిన మీనా.. మీనా అప్పటికే అనూష అనే ఫ్రెండ్‌ని స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్తుంటుంది. మధ్యలో తెలిసిన ఓ అక్క కూడా ఎక్కుతాను అని అంటుంది. మీనా వద్దని వారిస్తుంది. అది రూల్స్‌కి విరుద్దం అని మీనా అంటే.. ఏం రూల్స్.. ఇక్కడ ఎవ్వరూ ఉండరు.. ఇది చిన్నదే కదా అని ఎక్కేస్తుంది. ఇక ట్రాఫిక్ పోలీసులు స్కూటీ ఆపుతారు. ఈయన మాతో గొడవ పడిన వ్యక్తే కదా అని అనుకుంటుంది మీనా. వాళ్లు అలా రూల్స్ పాటించకపోవడం ఎంత తప్పో.. మనం అలా కీ తీసుకోవడం కూడా తప్పే అని అరుణ్ అంటాడు.నువ్వు ఆ రౌడీ డ్రైవర్ భార్యవే కదా.. ఫైన్ 500 కట్టి వెళ్లండని అరుణ్ అంటాడు. సామాన్యుల దగ్గర దోచుకోవడం కాదు అని మీనా అంటుంది. నేను ఎవ్వరి దగ్గర అన్యాయంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. నువ్వు ఆ రౌడీ డ్రైవర్ భార్యవే కదా.. నేను ఎమర్జెన్సీలో ఉంటే.. నో పార్కింగ్‌లో బైక్ పెట్టానని రూల్స్ గుర్తు చేశాడు.. ఆ రూల్స్ మీకు చెప్పలేదా? మరి అని అడుగుతాడు అరుణ్. మా ఆయన రౌడీ కాదు.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు .. మీకు ఫైన్ కడితే చాలు కదా అని అంటుంది మీనా.ఫైన్ కట్టిన మీనా.. ఇదంతా నీ వల్లే కదా.. నువ్వే డబ్బులు ఇవ్వు అక్కా అని మీనా అంటుంది. నా దగ్గర లేవు.. తర్వాత ఇస్తా అని అంటుంది. ఇప్పుడు నేను కడతాను.. నువ్వు మళ్లీ నాకు ఇవ్వు అని మీనా అంటుంది. ఫైన్ కట్టేస్తుంది మీనా. ఫైన్ కట్టాం ఇక ఈ రోజంతా తిరగొచ్చు.. నన్ను మా ఇంటి వద్ద డ్రాప్ చెయ్యి అని అంటుంది. తప్పు అని తెలిసిన తర్వాత మళ్లీ తప్పు చేయడం.. తప్పు.. నువ్వు నడుచుకుంటూ వెళ్లు అక్కా అని మీనా చెప్పేసి వెళ్లిపోతుంది.రోహిణి లేకపోతే నీ పరిస్థితి ఇంతే.. షాపులో ఈగలో తోలుకుంటూ ఉంటాడు మనోజ్. ఏంటి ఈగలు తోలుతున్నావా? పార్కులో కూడా ఇలానే ఉంది పరిస్థితి అని మణికంఠ చెప్తాడు. అదంతా నాకు ఎందుకు చెప్తున్నావ్ అని అడుగుతాడు మనోజ్. రోహిణి లేకపోతే నీ పరిస్థితి ఇంతే.. ఆమె వల్లే నువ్వు ఈ స్థాయికి వచ్చావ్.. ఆమె లేకపోతే నువ్వు జీరో అంటూ మాట్లాడతాడు మణికంఠ. ఈ భజన చేయడానికి ఎంత తీసుకున్నావ్ అని మనోజ్ అంటే.. అలా నేను తీసుకోను.. ఇదే నిజం అని మణికంఠ అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్: మామిడితోటలో మహాని ఏడ్పించిన ఆకతాయిలు.. చితక్కొట్టేసిన చక్రి మేనమామ.. మాధవకి గాయత్రి సలహా



