సిగ్నల్స్ వద్ద నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు కదా.. వెళ్లొచ్చు కదా అని అరుణ్‌ను సుమతి అంటుంది. ఫ్రెండ్సా? అంటే.. అని అరుణ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అదే ట్రాఫిక్ పోలీసులు లేరు కదా.. వెళ్లొచ్చు కదా అని అంటున్నాను అని సుమతి చెబుతుంది. అలా లేరు కదా అని వెళ్లడం తప్పు.. ఎవ్వరూ చూడటం లేదు కదా అని దొంగతనం చేయడం తప్పు కదా అని అరుణ్ అంటాడు. మీరు చాలా సిన్సియర్.. నా దగ్గర కూడా ఫైన్ వేశారు అని సుమతి అంటే.. ఆ స్థానంలో మా అమ్మ ఉన్నా ఫైన్ వేస్తా అని అంటాడు అరుణ్. అలా వేయకపోతే నా ఉద్యోగానికి ద్రోహం చేసినట్టు అవుతుంది.. రిటైర్డ్ అయ్యేటప్పుడు నిజాయితీగా రిటైర్డ్ అవ్వాలని అనుకుంటున్నా.. అని అరుణ్ అంటాడు. ఇంతలో ఇక బైక్ ఆపమని సుమతి అంటుంది. అరుణ్, సుమతి మాట్లాడుకునేది మీనా కూడా చూస్తుంది. దర్జాగా ఇంటి వద్ద డ్రాప్ చేసే రోజుని త్వరగా రానివ్వు అని అరుణ్ అంటే.. ఆలోచిస్తాను అని సుమతి చెప్పి వెళ్లిపోతుంది. ఇతను ఎవరు? అని మీనాలో అనుమానం మొదలు అవుతుంది.ఆ రోహిణి పొగరు తగ్గలేదా? ఇంటికి వచ్చిన సుమతి.. అమ్మకి అన్నం తినిపిస్తుంటుంది. ఇంతలో మీనా కూడా వస్తుంది. నువ్వు కూడా తింటావా? అక్కా అని అడుగుతుంది. నాకు వద్దు.. ఆకలిగా లేదు అని అంటుంది. మీ ఇంట్లో గొడవలు తగ్గాయా? అని అడిగితే.. మా మామయ్య గారి అమ్మ గారు వచ్చి సెట్ చేసి వెళ్లారు అని అంటుంది మీనా. ఇంకా ఆ రోహిణి పొగరు తగ్గలేదా? ఇంకా నిన్ను ఏమైనా అంటోందా? సుమతి అడిగితే.. ఒకప్పటిలా నా తప్పు లేకుండా అంటే పడే రోజులు పోయాయి లే అని మీనా చెబుతుంది. మీరిద్దరూ ఉండండి.. పూల కొట్టుకి నేను వెళ్తాను.. అక్కకి కాఫీ పెట్టు అని వెళ్తుంది అమ్మ.నేనే చెబుదాం అని అనుకున్నా.. ఈ రోజు నువ్వు బస్సులోనే వచ్చావా? రూట్ మారిందా? అని సుమతిని మీనా అడుగుతుంది. ఎవరితోనో బైక్‌లో వస్తుండటం, డ్రాప్ చేయడం చూశావా? అక్కా.. ఆ విషయం నేనే చెబుదాం అని అనుకున్నా.. కానీ చెప్పలేకపోయా అని సుమతి అంటుంది . ప్రేమించుకుంటున్నారా? అని మీనా అడుగుతుంది. ఒక రోజు వచ్చి నేను అంటే ఇష్టం.. పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు.. కానీ నాకు టైం కావాలి.. బాధ్యతలు ఉన్నాయి.. తమ్ముడు చదువు అవ్వాలి.. ఉద్యోగం రావాలి అని చెప్పా అని సుమతి అంటుంది.మీరంతా ఒప్పుకుంటేనే చేసుకుంటాను నీ బాధ్యతలు ఓకే గానీ.. అతను మంచి వాడు అయితే.. నిన్ను బాగా చూసుకుంటాడు అని నీకు నమ్మకం ఉంటే.. అంతకంటే మాకేం కావాలి అని అంటుంది మీనా. చాలా నిజాయితీ ఉన్నవాడు అక్కా అని అంటుంది సుమతి. సరే నేను, మీ బావ వెళ్లి మాట్లాడతాం లే అని అంటుంది మీనా. నేను ఇంత వరకు ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకోలేదు.. నువ్వు, బావ, అమ్మ ఒప్పుకుంటేనే చేసుకుంటాను అని అంటుంది సుమతి. నీకు ఇష్టం అయితే బావ ఎందుకు వద్దంటాడే అని మీనా అంటుంది. దీంతో సుమతి సిగ్గు పడుతుంది.దొంగని చెక్ చేసినట్టు.. మీనా ఇంటికి రాగానే కాఫీ పెట్టమని అడుగుతాడు బాలు. ఇక రోహిణి కూడా అప్పుడే వస్తుంది. ఎక్కడికి వెళ్లావ్.. అక్కడ పని ఎలా జరిగింది.. భోజనాలు అయ్యాయా? డబ్బులు ఎంత ఇచ్చారు? అని ఇలా దొంగని పోలీసులు ప్రశ్నించినట్టుగా ప్రశ్నిస్తుంది ప్రభావతి. ఇదంతా కూడా కిచెన్ నుంచి బాలు, మీనాలు చూస్తూ ఉంటారు. 25 వేలు అత్తయ్య అని రోహిణి చెబితే.. ఇవ్వు అని అంటుంది ప్రభావతి. డబ్బులు ఇవ్వలేదు.. ఆన్ లైన్ చేస్తామని అన్నారు అని రోహిణి చెబుతుంది. కానీ ఆ మాటల్ని నమ్మని ప్రభావతి.. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అంతా చెక్ చేస్తుంది.ఏటీఎం కార్డ్ తీసుకుని.. ఏటీఎం కార్డ్ ఇవ్వు.. అని తీసుకుంటుంది ప్రభావతి. దీని పిన్ ఏంటి? అని అడుగుతుంది. మీ అబ్బాయి పుట్టిన సంవత్సరం అని రోహిణి అంటుంది. అదే ఏంటి? అని అడుగుతుంది ప్రభావతి. మీ అమ్మకి కనీసం మీ అన్న పుట్టిన ఏడాది కూడా గుర్తు లేదా? అని బాలుతో మీనా అంటుంది. 1992 అని రోహిణి చెబుతుంది. సరే వెళ్లు.. డబ్బులు పడ్డాక నేను తీసుకుంటాను అని ప్రభావతి అంటుంది. దీంతో రోహిణి సైలెంట్‌గా వెళ్లిపోతుంది. ఇది అన్యాయం కదండి.. రోహిణి కష్టార్జితాన్ని అత్తయ్య గారు దోచుకుంటున్నారు అని బాలుతో మీనా అంటుంది.మేం కలవొద్దని కంకణం కట్టుకున్నట్టుంది దీని మాటలు నమ్మొచ్చా? ఇది ఒరిజినల్ కార్డేనా? మళ్లీ మోసం చేస్తుందా? అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో షాప్ నుంచి మనోజ్ వస్తాడు. నీకు తల్లి ఇష్టమా? పెళ్లాం ఇష్టమా? అని ప్రభావతి అడుగుతుంది. నీది ఏం బతుకురా మనోజ్ అని మనోజ్ లోలోపల అనుకుంటూ.. నువ్వే ఇష్టం అమ్మా అని అంటాడు మనోజ్. మళ్లీ అది ఏమైనా షాప్‌కి వచ్చిందా? మీరు కలిశారా? అని మనోజ్‌ను అడుగుతుంది. మేం కలవొద్దని కంకణం కట్టుకున్నట్టుంది అని మనోజ్ లోలోపల అనుకుంటాడు. కలవలేదు అమ్మ.. నాకు అంత టైం కూడా లేదు.. నేను దాంతో మాట్లాడను అని అంటాడు మనోజ్. దాంతో మాట్లాడినట్టు తెలిస్తే చంపేస్తా అని ప్రభావతి అంటుంది. నాకు ఓపిక లేదమ్మా నేను వెళ్తాను అని మనోజ్ అంటాడు.నన్ను కట్టేసినట్టుగా ఉంది రూంలోకి వచ్చిన మనోజ్ తిన్నావా అని రోహిణిని అడుగుతాడు. ఒకప్పుడు తిందామా? అని అడిగేవాడివి.. ఇప్పుడు తిన్నావా? అని అంటున్నావ్.. అంటే మనం వేరుగా ఉన్నాం అని నువ్వు కూడా డిసైడ్ అయ్యావా? అని రోహిణి అంటుంది. ఇప్పుడు నీ సమస్య ఏంటి? అని మనోజ్ అడుగుతాడు. ఇక్కడ నన్ను కట్టేసినట్టుగా ఉంది అని అంటుంది. బాగానే మాట్లాడుతున్నావ్ కదా.. ఇంకా ఏంటి? అని మనోజ్ అంటాడు. నాలుగు గోడల మధ్య కాదు.. అత్తయ్య ముందు మాట్లాడలేకపోతోన్నా అని రోహిణి అంటుంది. దానికి కారణం ఎవరో నీకు తెలీదాా? అని మనోజ్ అంటాడు.మా అమ్మే నాకు దేవత.. మీ అమ్మ నా బ్యాగ్ చెక్ చేసింది.. ఏటీఎం కార్డ్ తీసుకుంది.. నీ బర్త్ డేని పిన్‌గా పెడితే. తీసుకుంది.. నీ గుర్తులు నా దగ్గర ఉండకూడదా? అని రోహిణి అంటుంది. మా అమ్మ ఏం చేసినా కరెక్ట్.. ప్రతీ దానికి ఏదో ఒక కారణం ఉంటుంది.. మా అమ్మ గురించి నా దగ్గర చాడీలు చెప్పకు.. మా అమ్మే నాకు దేవత అని అంటాడు మనోజ్. ఇక రోహిణి ఎంతగా మొత్తుకుంటున్నా.. నేను ఎవరిని అని అంటున్నా వినిపించుకోకుండా వెళ్లిపోతాడు మనోజ్. రోహిణి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది.నాకు లేని బాధ మీకు ఎందుకు రా.. ఏటీఎం కార్డ్ లాక్కోవడం అన్యాయం అంటూ రవి, శ్రుతి, బాలు, మీనా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్‌ని రవి ఫోన్ చేసి పైకి పిలుస్తాడు. అలా అమ్మ ఏటీఎం కార్డ్ లాక్కోవడం అన్యాయం కదా అని అంటే.. నాకు లేని బాధ మీకు ఎందుకు రా.. అయినా ఆ విషయాన్ని వాళ్లిద్దరూ చూసుకుంటారు.. మీకు ఎందుకు రా అని అంటాడు మనోజ్. దీంతో బాలుకి కోపం వస్తుంది. భార్యకి సపోర్ట్‌గా ఉండవారా అని తిడతాడు బాలు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్: నువ్వు అసలు మగాడివేనారా?.. పెళ్లి కొడుకుని తిట్టిన శైలు.. కడుపుతో ఉన్నా అని చెప్పడంతో ఖంగుతిన్న వరాలు




