మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని రోహిణి గారు హోమం చేయించారు.. మీకు కళ్లు పోయినప్పుడు వచ్చి చేయించారు అని విబూది తెచ్చి మనోజ్‌కి ఇస్తాడు పంతులు. అలాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం అని ఓ డైలాగ్ వేసి పోతాడు పంతులు. ఆ మాటతో మనోజ్ కాస్త సంతోషిస్తాడు. మీరు చెప్పినట్టుగానే చెప్పాను అమ్మా అని రోహిణికి ఫోన్ చేసి ఆ పంతులు చెబుతాడు. ఆయన మొహంలో సంతోషం కనిపించిందా? అని రోహిణి అడిగితే.. ఆశ్చర్యం కనిపించింది అని పంతులు చెబుతాడు. ఆ ఆశ్చర్యమే సంతోషంగా, ప్రేమగా మారుతుంది.. ద్వేషం తగ్గుతుంది అని రోహిణి అనుకుంటుంది. ఇంతలో షాప్ పబ్లిసిటీ కోసం పాంప్లేట్స్ పంచి వస్తుంటారు పని చేసే ఎంప్లాయిస్. ఇదంతా ఎవరు చేయమన్నారు అని మనోజ్ అడిగితే.. ఇది వారం నుంచి జరుగుతుంది.. రోహిణి గారు చెప్పారు.. అని అంటారు. దీంతో రోహిణి గురించి కాస్త పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు మనోజ్. ఇక వంట గదిలో రోహిణి కుస్తీ పడుతుంటుంది. నువ్వేంటి ఇక్కడ అని మీనా అడుగుతుంది. ఇకపై నా వంట నేనే వండుకోవాలని అత్తయ్య గారు అన్నారంటూ రోహిణి చెబుతుంది.టైం బాగా లేకపోతే.. నీకు వంట రాదు కదా రోహిణి అని మీనా అంటే.. తప్పదు నేర్చుకోవాలి.. టైం బాగా లేకపోతే ఎలాంటి స్థితి నుంచి అయినా ఇలాంటి స్థితికి రావాల్సిందే అని రోహిణి అంటుంది. పర్లేదు మారిపోయేలానే ఉంది అని మీనా అనుకుంటుంది. ఇంతలో శ్రుతి వస్తుంది. ఏదో మాడిన వాసన వస్తోంది.. అని శ్రుతి కౌంటర్లు వేస్తుంది. రోహిణి వంట చేస్తోంది అని మీనా చెబితే.. రోహిణినా? వంటనా? అని షాక్ అవుతుంది. ఒకప్పుడు హోం మినిస్టర్, ఇప్పుడు కిచెన్‌కి ట్రాన్స్ ఫర్ చేశారా? అని కౌంటర్లు వేస్తుంది.వంట మీద ఫోకస్ పెట్టనివ్వు.. నీకు ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే గెస్ చేశా.. అత్తయ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నప్పుడు నీ కళ్లు ఆకాశంలో ఉండేవి.. అప్పుడే నీకు ఇలాంటి స్థితి వస్తుందని అనుకున్నా.. అని శ్రుతి అంటుంది. నన్ను వంట మీద ఫోకస్ పెట్టనివ్వు.. డిస్టర్బ్ చేయకు అని రోహిణి అంటుంది. మరి మీనా అందరికీ సమాధానం చెబుతూ, వంట చేసేది.. ఇప్పటికైనా మీనా కష్టాన్ని ఒప్పుకుంటావా? అని శ్రుతి అంటుంది. నాక్కూడా టైం వస్తుంది.. అప్పుడు చెప్తా అని రోహిణి అంటుంది. ఇప్పటికే నువ్వు ఎక్కువ మాట్లాడావ్ అని రోహిణి అంటుంది.ఈ కథ అంతా నీదేనా? ఒకటి గమనించావా? మీనా.. వీళ్ల తప్పుల్ని బయట పెట్టింది మీరే.. పెళ్లికి వెళ్లడం ఏంటి? మేక మామ మీ కంట పడటం ఏంటి.. ఇదంతా తలరాత.. అయినా మేకమామని మలేషియా మామగా చేయడం హైలెట్.. ఈ కథ అంతా నీదేనా? ఈ ట్విస్టులతో సీరియల్ తీస్తే పెద్ద హిట్ అవుతుంది అని శ్రుతి కౌంటర్లు వేస్తూ ఉంటుంది. శ్రుతి ఇక చాలు అని రోహిణి సీరియస్ అవుతుంది. మమ్మల్నే పట్టుకోవాలని, డైనింగ్ టేబుల్ని కోర్ట్ బోన్‌లా మార్చాలని చూసే వారికి ఇంకేం తెలుస్తుంది అని రోహిణి అంటుంది.తప్పులన్నీ మీరు చేసి.. తప్పులన్నీ మీరు చేసి మా మీద పడతారేంటి.. మీరు చేసినవే కదా మేం బయట పెట్టాం.. కల్పన తనంతట తాను మా ఆయన కారు ఎక్కింది.. మీ విషయం బయట పడింది.. మేక మామ మాకు ఎదురు వచ్చాడు.. మీరు తప్పులు చేసి మమ్మల్ని అంటావ్ ఏంటి అని మీనా ఫైర్ అవుతుంది. ఇదే కాదు ఇంకా రెండు విషయాలున్నాయి అని శ్రుతి అంటుంది. ఇంకా ఏదో దాచి పెడుతోందని, మనోజ్ కూడా రోహిణి గురించి ఏం తెలియకుండానే తెలుసు అని అబద్దం చెప్పాడు అని బాలుకి, నాకు అనుమానం వచ్చింది అంటూ శ్రుతి చెబుతుంది.ఎన్ని రోజులు దాచి పెడుతుంది.. అదేం లేదు అని రోహిణి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అత్తయ్య నిన్ను చంపేస్తారన్న భయంతో మనోజ్ అలా అబద్దం చెప్పాడు అని ఆయన అంటున్నాడు అని మీనా అంటుంది. నాక్కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది రోహిణి. ఏదో దాచి పెడుతుంది.. లేదంటే ఇంత సైలెంట్‌గా ఉండదు.. అని శ్రుతి అంటుంది. అవును మా ఆయన కూడా అదే అంటున్నాడు అని మీనా అంటుంది. ఎన్ని రోజులు దాచి పెడుతుంది.. ఏదో ఒక రోజు బయట పడాల్సిందే అని శ్రుతి అంటుంది.నీకు ఇక ఎదురు పడను.. అరుణ్ కోసం గుడిలో వెయిట్ చేస్తుంటుంది సుమతి. అరుణ్ బర్త్ డే అన్నాడు.. ఇంకా రాలేదు.. త్వరగా వెళ్లాలి.. అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని సుమతి కంగారు పడుతుంటుంది. ఇంతలో అరుణ్ వస్తాడు. హ్యాపీ బర్త్ డే అరుణ్ అని చెబుతుంది సుమతి. నువ్వు చెప్పాల్సిన విషయం చెప్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టుగా అరుణ్ అంటాడు. నీకు ఇష్టం లేకపోతే.. చెపొద్దు.. ఇలా బలవంతంగా ప్రేమను పుట్టించలేం.. నీకు ఇష్టం లేకపోతే ఇకపై నిన్ను కలవను.. నీకు ఎదురు పడను అని అరుణ్ అంటాడు.పెళ్లికి ఒప్పించాలి.. మీరంటే నాకు ఇష్టమే అని అంటుంది సుమతి. దీంతో అరుణ్ గాల్లో తేలిపోతాడు. కానీ పెళ్లికి టైం కావాలి.. ప్రేమకు ఇద్దరి వ్యక్తులు సరిపోతారు.. పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి.. మా ఇంట్లో ఒప్పించాలి.. మీరు చాలా మంచి వారు, నిజాయితీతో ఉంటారు.. మిమ్మల్ని కాదనడానికి కారణాలు లేవు.. కానీ ఇంట్లో వాళ్లని కూడా ఒప్పించాలి అని సుమతి అంటుంది. అంత వరకు వెయిట్ చేద్దాం అని అరుణ్ అంటాడు. ఇక బయటకు కలిసి వెళ్దాం అని అరుణ్ రిక్వెస్ట్ చేస్తాడు. అదే టైంకి ఓ ట్రిప్ కోసం బాలు వస్తాడు. కానీ వీరిని చూడడు. వీళ్లు కూడా బాలుని చూడరు.సుకుమారంగా పెరిగి ఉంటుందని అనుకున్నా.. రూంలో ఉంటే రోహిణి మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని, చేతులు వేస్తోందని బయటకు వస్తాడు మనోజ్. నువ్వు బయటకు రావడం ఏంట్రా.. మగాడివి.. నీదే పై చేయి ఉండాలి.. దాన్ని కింద పడుకోమను అని అంటుంది ప్రభావతి. మరి ఇన్ని రోజులు రోహిణిని మహారాణిలా చూసుకున్నావ్ కదా అని బాలు అంటే.. అది అప్పుడు.. మలేషియా నుంచి వచ్చింది.. సుకుమారంగా పెరిగి ఉంటుందని అనుకున్నా.. కానీ అది చెత్తకుప్ప నుంచి వచ్చిందని తెలిసింది కదా అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు నా కొడుకే నాకు ముఖ్యం అని ప్రభావతి అంటుంది.ఇది నీ మాటనా? మీ అమ్మ మాటనా? ప్రభావతిని తన వచ్చీ రానీ ఇంగ్లీష్‌తో బెదరగొడతాడు బాలు. ఇంకో వైపు రూంలోకి వచ్చిన మనోజ్.. నువ్వు నా పక్కన పడుకుంటే నేను ఇక్కడ పడుకోలేను అని బెడ్డు మీద పడుకుంటాడు మనోజ్. ఇది నీ మాటనా? మీ అమ్మ మాటనా? అని రోహిణి అంటుంది. దీంతో మనోజ్‌ని తల్చుకుంటూ రోహిణి బాధ పడుతుంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్: శైలుని నమ్మించి గొంతు కోస్తున్న వరాలు.. మాధవకి, మనీషాకి ముడి పెడుతున్న గాయత్రి




