
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Fire accident in langar houz apartment in Hyderabad: హైదరాబాద్ వ్యాప్తంగా ఆషాడ బోనాల సంబురాలు అంబరాన్ని తాకాయి. ప్రతి ఒక్క గుడికి కూడా భక్తులు బొనాల కోసం అందంగా అలంకరించారు. పోతురాజుల విన్యాసాలు,శివసత్తుల పూనకాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులు మొదలైన ఉత్సవాలతో బోనాల పండుగతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఈ నేపథ్యంలో బోనాల వేళ ప్రజలు భక్తి భావనలతో బోనాలను పెట్టుకుని అమ్మవారి ఆలయాలకు వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని ఒక అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని బాపునగర్ లో ఉండే కుటుంబం బోనాల సమర్పణకు దగ్గరలోని అమ్మవారి ఆలయంకు వెళ్లారు. వారు భక్తితో పూజలు చేసుకుని బోనాలను సమర్పించారు.ఆ తర్వాత వారు తిరిగి వచ్చే వరకు ఇంట్లో నుంచి నల్లని పొగలు బైటకు వస్తున్నాయి. అప్పుడు వెంటనే ఇంట్లో వెళ్లి చూడగా ఇల్లంత మంటలు అంటుకున్నాయి.
వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలుచేపట్టారు. అసలు మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూట్ కారణామా..?..లేదా మరేదైన కారణం ఉందా..?.. అని సదరు కుటుంబం తలలు పట్టుకుంటున్నారు.
Read more: Hyderabad: హైదరాబాద్ ఘనంగా కొనసాగుతున్న బోనాల సంబరాలు.. పలు ఆలయాల్ని దర్శించుకున్న కేటీఆర్..
దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బోనాల పండగ రోజు ఈప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో మాత్రం తీవ్రవిచారంలో మునిగిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





