నేను కూడా ఈ ఇంటి వారసురాలినే నాకు డబ్బులు ఇవ్వు అని ఇందుని ఐశ్వర్య అడుగుతుంది. నువ్వు అసలు అని అపర్ణ ఏదో అనబోతంటే ఇందు ఆపుతుంది. డబ్బులు లేవు.. ఆల్రెడీ లెక్కలు చెప్పాను.. కదా.. తాతయ్య ఆపరేషన్ కోసం మాత్రమే డబ్బుంది అని ఇందు అంటుంది. ఆ డబ్బులే ఇవ్వు.. ఇప్పుడు ఆ ముసలోడికి ఆపరేషన్ అవసరమా? చచ్చే వరకు అలానే చెయిర్లో ఉంటాడు.. లేచి పొడిచేది ఏముంది అని ఐశ్వర్య అంటుంది. ఆ మాటలకు ఇందుకి అగ్ని పర్వతం బద్దలైనట్టుగా కోపం వస్తుంది. ఐశ్వర్యను లాగి పెట్టి కొడుతుంది. ఆ సౌండ్‌కే భ్రమరం భయపడిపోతుంది. ఏం అన్నావ్.. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను.. నన్ను ఎన్ని అన్నా నేను భరిస్తాను కానీ.. తాతయ్య, నానమ్మని అంటే మాత్రం అసలు ఊరుకోను.. వాళ్లని ముసలివాళ్లు అని అంటావా? ఇంకో ముప్పై ఏళ్లు అయితే నువ్వు కూడా అలానే అవుతావ్ కదా అని తిడుతుంది ఇందు. ముసలివాళ్లు అని అంటున్న వాళ్లే ఒకప్పుడు ఈ దుగ్గిరాల వంశాన్ని నిలబెట్టారు.. వాళ్లే మనకు గతాన్ని ఇచ్చారు.. మన భవిష్యత్తుని తీర్చి దిద్దుతారు.. సీతారామయ్య తాత ఇచ్చిన వారసత్వాన్ని వీళ్లే కొనసాగించారుఐశ్వర్యకు చీవాట్లు.. వాళ్లంటూ ఉన్నారు కాబట్టే.. మనం పుట్టుకతోనే ఓ ఐడెంటెటీతో వచ్చాం.. నీలాగా వాళ్లు కూడా తాగుడు, తిరుగుడు, పబ్స్ అంటూ వెళ్తే మనం ఉండే వాళ్లమే కాదు, ఇంకోసారి వాళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని తిట్టేసి వెళ్తుంది ఇందు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు.. నరం లేని నాలుక ఇలా అనవసరంగా వాగితే ఇలానే ఉంటుంది.. అందుకే నోరు అదుపులో పెట్టుకో అనేది అని నందు కూడా తిడుతుంది. దీంతో ఐశ్వర్యకి ఒళ్లు మండిపోతూ ఉంటుంది. ఇంకో వైపు శేషు పగలబడి నవ్వేస్తుంటాడు.రెచ్చగొట్టిన రేఖ.. ఇలా ఇందు కొడుతుందని నీకు ముందే తెలుసు కదా అమ్మా.. అందుకే కదా నువ్వు డబ్బులు అడగలేదు.. బావ చేత అడిగించలేదు.. పెద్దావిడ అని భ్రమరంతో అడిగించ లేదు.. పాపం నీ ప్లాన్ తెలీక నిన్ను నమ్మేసింది అని శేషు నవ్వేస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని కవర్ చేస్తుంది రేఖ. ఇందు అలా చేయడం, ఐశ్వర్యని కొట్టడంతో నేను ఎంతో బాధపడ్డాను.. ఐశ్వర్య కూడా ఈ ఇంటి వారసురాలే.. ఆస్తిలో హక్కుంది కానీ.. ఆ ఇందు మాత్రం చిల్లిగవ్వ రానివ్వకుండా చేస్తోంది అని ఇంకా రెచ్చగొడుతుంది రేఖ.అక్కా చెల్లెళ్లకు మంట పెట్టా.. నన్నే కొడుతుందా? దాని సంగతి చూస్తా.. అని ఐశ్వర్య అంటే.. నువ్వేం చేయలేవు అని శేషు అంటాడు. బాబాయ్.. అని అరిచేస్తుంది ఐశ్వర్య. వద్దులే ఇది కోపంగా ఉన్నట్టుంది.. కాస్త సైలెంట్‌గా ఉందామని శేషు అంటాడు.త్వరలోనే దీని సంగతి చెప్తా అని ఐశ్వర్య వెళ్లిపోతుంది. నాక్కావాల్సింది కూడా ఇదే అని రేఖ అంటుంది. ఏంటి రేఖ ఇదంతా నువ్వే చేశావా? అని భ్రమరం అంటుంది. మీరే అన్నారు కదా.. నేనేం చేయడం లేదు.. సైలెంట్‌గా ఉంటున్నానని.. అందుకే అక్కా చెల్లెళ్లకు మంట పెట్టా.. ఆ రాజు కూడా ఏం చేయలేేడు.. అని రేఖ అంటుంది.ఆనంద భాష్పాలు.. ఏంటి సుబ్బు.. ఎందుకు ఏడుస్తున్నావ్ అని ఇందు అడుగుతుంది. ఇవి ఆనంద భాష్పాలు అమ్మా.. అని సుభాష్ అంటాడు. ఈ కాలంలో అందరూ ఐశ్వర్యలానే ఆలోచిస్తున్నారు.. ముసలివాళ్లు అని వదిలేసుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం మా గురించి గొప్పగా చెప్పావ్.. అది తల్చుకుంటూనే ఆనంద భాష్పాలు వస్తున్నాయి అని సుభాష్ అంటాడు. ముందులా నిన్ను మళ్లీ ఈ ఇంట్లో దర్జాగా తిరగడం చూడాలి తాతయ్య అని ఇందు అంటుంది. కానీ ఆ రేఖ చేయనిస్తుందా? ఓసారి ఇంజక్షన్ కోసమే ఎలా చేసిందో చూశాం కదా అని అపర్ణ అంటుంది.ఇంట్లో మీరు నడవడం నేను చూస్తాను ఇందుని అంతలా హింసించిందా? రేఖ పిన్ని గురించి తెలుసు కానీ.. మరీ ఇంత దుర్మార్గురాలు అని అనుకోలేదు అని రాజు అంటాడు. పాము పైకి సన్నగానే కనిపిస్తుంది.. కానీ కాటు వేస్తేనే విషం తెలుస్తుందన్నట్టుగా మా రేఖ పిన్ని కూడా అంతే అని నందు అంటుంది. ఇవన్నీ ఇంతకు ముందు.. ఇప్పుడు కాదు.. నేను మీకు తోడుంటా తాతయ్య.. మీరు నడవడం నేను చూడలేదు.. ఈ ఇంట్లో మీరు నడవడం నేను చూస్తాను అని నమ్మకం ఉంది.. మీరేం భయపడకండి.. అని రాజు భరోసానిస్తాడు.కొత్త కారెక్టర్ గురించి.. మనవడికి నిజం ఎప్పుడు చెప్తావ్.. బొమ్మలాటలా జరిగిన పెళ్లిని నిజం పెళ్లిగా ఎప్పుడు మారుస్తావ్ అని అడుగుతుంది అపర్ణ. ముందు తాతయ్య నడవాలి, నందు పోలీస్ అవ్వాలి.. ఐశ్వర్యక్కని మార్చాలి.. తర్వాత చెప్తా అని అంటుంది ఇందు. అంతలోపు మనవడికి ఎవరైనా నచ్చితే, ఎవరిపైనా అయినా మనసు పడితే అని అపర్ణ, సుభాష్ అంటుంటే.. హాస్పిటల్లో రాజు ట్రీట్మెంట్ ఇస్తున్న అమ్మాయిని చూపించీ చూపించినట్టుగా చూపిస్తున్నారు. అంటే ఈ కథలోకి మరో కొత్త కారెక్టర్ని తీసుకు రాబోతోన్నారు.. రాజు ప్రేమించిన ఆ అమ్మాయిని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.పుట్టిన బిడ్డనే వదిలేశావ్.. పిన్ని నిన్ను ఓ ప్రశ్న అడగాలా? అని రాజు అంటాడు. ప్రశ్న నీదే అయినప్పుడు.. సమాధానం కూడా నువ్వే చెప్పుకో అని రేఖ అంటుంది. నాకు అవసరం లేని వాటి గురించి పట్టించుకోను వదిలేస్తాను అని రేఖ అంటుంది. అవును నిజమే అందుకే కదా.. పుట్టిన బిడ్డనే వదిలేశావ్.. మదన్‌ని కూడా అలానే వదిలేస్తావా? అవసరం లేకపోతే అని రాజు అంటాడు. దీంతో రేఖకి కోపం వస్తుంది. వాడు ప్రపంచానికి తెలిసిన బిడ్డ కాబట్టి వదులుకోలేవు లే అని రాజు అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: మంచికిపోతే చెడు ఎదురైనట్టు.. బాలు మీద రోహిణి నిందలు.. మీనాకి ఫైన్ వేసిన అరుణ్



