
Anakapalle: నర్సీపట్నంలో విచిత్ర చోరీ: వెండి వస్తువులతో పాటు భోజనం కూడా!
Anakapalle: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్రమైన చోరీ ఘటన వెలుగు చూసింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు.. గ్రంధి వెంకట కృష్ణ దంపతులు ఇంట్లోలేని సమయంలో దొంగ చొరబడ్డారు. 10 తులాల వెండి వస్తువులను అపహరించాడు. వంట గదిలోకి వెళ్లి కుక్కర్లోని అన్నం, పెరుగు తినేశాడు. ఇంటికి వచ్చిన బాధితులు చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు....
మొత్తానికి ఇంటికి కన్నం వేయడమే కాకుండా తాపీ గా భోజనం చేసి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.....
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media





