బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని ఆరో ఎపిసోడ్లో డేర్ ఆర్ డై అని టాస్కుల్ని పెట్టారు. ఈ టాస్కుల్లో గెలిచిన వారిని టాప్ 15లోకి పంపించారు. అలా నేటి ఎపిసోడ్ ద్వారా నలుగురు కంటెస్టెంట్లు తమ బెర్తుల్ని కన్పామ్ చేసుకున్నారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసే సరికి టాప్ 15లోకి ఏడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు. హోల్డ్‌లో ఉన్న 14 మంది నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్లో 13 మంది నుంచి టాప్ 15కి ఇంకో 8 మంది కంటస్టెంట్లను సెలెక్ట్ చేస్తారన్న మాట. మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.షాలిని, అమన్ ఇద్దరూ కూడా మొదటి టాస్క్‌లో పోటీ పడ్డారు. కుళ్లిన కూరగాయలు అంటూ పెట్టిన ఈ టాస్కులో షాలిని చాలా స్పీడుగా దూసుకుపోయింది. ఈ చివరకు ఈ టాస్కులో షాలిని గెలిచి టాప్ 15లో స్థానం సంపాదించుకుంది. రెండో టాస్కు ప్రారంభం కంటే ముందు బ్రేకప్ స్టోరీలను చెప్పమని అన్నారు. అలా దీపక్, రోహిత్, గాయత్రి ఇలా కొంత మంది తమ తమ బ్రేకప్ స్టోరీలను చెప్పారు. రెండో టాస్కుగా ఎక్స్‌కి ఫోన్ చేసి మళ్లీ జీవితంలో కలవాలి.. ఐ లవ్యూ చెప్పాలి.. సారీ అని అడగాలి అనే టాస్క్ ఇచ్చారు.ఈ రెండో టాస్క్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. గంటను ముందు పట్టుకున్న వారే టాస్క్ ఆడాల్సి ఉంటుందని ఓ ట్విస్ట్ పెట్టారు. కానీ దీపక్, రోహిత్, గాయత్రి ఇలా అందరూ గంటను పట్టుకుని గెలుస్తారు. కానీ వారి ఫోన్లను అవతలి వ్యక్తులు లిఫ్ట్ చేయరు. దీంతో చివరకు శ్రష్టికి ఈ ఛాన్స్ వస్తుంది. తన మాజీ లవర్‌కి ఫోన్ చేసి తప్పైందని, సారీ అని, ఐ లవ్యూ అని, నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి సరే అని సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇప్పుడు ఇలా సడెన్‌గా ఫోన్ చేసి మాట్లాడటం నా తప్పే అని ఫోన్ కట్ చేస్తుంది.ఈగోని పక్కన పెట్టి చేశా.. నేను నిజంగానే ప్రేమించా.. నేనే నా లైఫ్ లోంచి వెళ్లమని అన్నాను.. వాడు మళ్లీ నాకు ఫోన్ చేయడని నాకు తెలుసు.. అని శ్రష్టి అంటుంది. తప్పు చేసిన మనిషి..వద్దని అనుకున్నా వాడికి ఫోన్ చేసి మాట్లాడటం.. గ్రేట్.. సామాన్యమైన విషయం కాదు.. అని శ్రీముఖి, అభిజిత్, బిందు, నవదీప్ పొగిడేస్తారు. అలా శ్రష్టికి కూడా టాప్ 15లో స్థానం లభిస్తుంది. ఇక మూడో టాస్కుగా టాటూ అని చెప్తారు. దాదాపు అందరూ నిల్చుంటారు. నుదుటి మీద వేసుకోవాలని అంటారు. అయినా సరే ఎవ్వరూ వెనక్కి తగ్గరు. తూ నా బతుకు అని వేసుకోవాలి అని చెప్తారు. అయినా సరే తగ్గరు. ఐ యామ్ ఏ లూజర్ అని వేయించుకోవాలని అంటారు. అయినా కూడా తగ్గేదేలే అంటారు.చివరకు కృష్ణ అనే కంటెస్టెంట్ తూ నా బతుకు అని టాటూని వేయించుకుని టాప్ 15లోకి బెర్తుని కన్పామ్ చేసుకుంటాడు. హెయిర్ కట్ టాస్కుని ఇస్తారు. దీనికి ఆడవాళ్లంతా రెడీ అవుతారు. హెయిర్ కట్ ఏ రేంజ్లో ఉండాలో కొన్ని ఫోటోలు చూపిస్తారు. అబ్బాయిలా కటింగ్ కొట్టించుకోవాలని చెప్పడంతో ఓ కంటెస్టెంట్ వెనక్కి వెళ్లిపోతుంది. కానీ లేడీస్ అంతా కూడా ముందుకు వస్తారు. అందులో భాగి అనే కంటెస్టెంట్ బెల్ పట్టుకునే టాస్కులో గెలిచి హెయిర్ కట్‌కి సిద్దం అవుతుంది. నవదీప్ వచ్చి కటింగ్ చేస్తాడని ముందు చెప్తారు. కానీ చివరకు స్టైలిష్ట్ వచ్చి చిన్నగా అబ్బాయిలా కటింగ్ కొట్టేసి వెళ్తాడు.అలా భాగి కూడా టాప్ 15లోకి వెళ్తుంది. విధిని నమ్మే వాళ్లు ముందుకు రండి అని అంటారు. నాలుగు కార్డ్స్ ఉంటాయి.. ఇందులో రెండు టాప్ 15, రెండు ఎగ్జిట్ ఉంటాయి.. ఇద్దరు వచ్చి వీటిని సెలెక్ట్ చేసుకోవాలి.. ఒక వేళ రెండు ఎగ్జిట్ వస్తే మాత్రం మళ్లీ ఓ టాస్క్ పెడతాం అని.. గెలిచిన వాళ్లు హోల్డ్.. ఓడిన వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్తారు. ఇక ఈ టాస్క్ ఆడేందుకు హేమంత్, వెంకటేష్ వస్తారు. ఇద్దరూ ఎగ్జిట్ కార్డ్‌నే తీస్తారు. వీళ్లకి బురద టాస్క్ ఇస్తారు. అందులో గ్రీన్ కార్డ్ తీస్తే విన్ అవుతారు. విన్ అయితే హోల్డ్, ఓడితే ఎలిమినేట్ అని చెప్తారు.చివరకు ఆ గ్రీన్ కార్డ్‌ని హేమంత్ పట్టుకుంటాడు. ఓడిన వెంకటేష్ బయటకు వెళ్లిపోతాడు. అలా నేటి ఎపిసోడ్ పూర్తయ్యే సరికి టాప్ 15లో ఏడు మంది, హోల్డ్‌లో 13 మంది ఉంటారు. రేపటి టాస్కులో టాప్ 15 మెంబర్స్ ఫిల్ అవుతారు. ఆ తర్వాత టాప్ 15 కంటెస్టెంట్లను రకరకలా టాస్కులు పెట్టి ఆడిస్తారు. చివరకు ఐదారుగుర్ని మాత్రమే బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.




