బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని మూడో ఎపిసోడ్లో రాజ కుమారి హైలెట్‌గా నిలిచారు. ఆమెతో పాటుగా వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు ఎన్నెన్నో కథల్ని చెప్పారు. ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. కానీ రాజ కుమారి కథ మాత్రం అందరినీ కదిలించింది. ఎప్పుడూ స్టేజ్ మీద కంటతడి పెట్టుకోని నవదీప్ కూడా ఏకంగా కన్నీరు పెట్టేసుకున్నాడు. ఆమె కథను విన్న బిందు మాధవి, అభిజిత్ అంతా కూడా హ్యాట్సాఫ్ చెప్పేశారు. ముగ్గురూ గ్రీన్స్ ఇచ్చేసి నేరుగా టాప్ 15లోకి పంపించేశారు. అసలు నేటి ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? హోల్డ్‌లోకి వచ్చిన వారు ఎవరు? అన్నది ఓసారి చూద్దాం.మొదటగా శ్రష్టి వ్యాకరణం అనే అమ్మాయి వచ్చింది. మోడల్ అని, మిస్ ఇండియా, మిస్ ఏసియా ఇలా చాలా వాటిల్లో పాల్గొని టాప్ 10లో ఉన్నానని చెప్పింది. తనకు నటన, డ్యాన్స్ అంటే ఇష్టమని, కాలేజీలో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తానని అంటే తన మాజీ ప్రియుడు కొట్టాడని, అప్పుడు చెవికి తీవ్రమైన గాయమైందని తెలిపింది.. ముంబైలో ఉంటున్నాను అని ఇలా తన స్టోరీ చెబుతూ వచ్చింది. నీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టమని బిందు మాధవి అడిగితే.. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని అంటుంది. ఎందుకు అని అంటే.. మార్చుకోవచ్చు కదా అని ఆమె చెబుతుంది. అందరూ ఇలానే అనుకుంటారు అని నవదీప్ నవ్వేస్తాడు.ఇక్కడ ఇలా ఉన్నావ్ కానీ.. లోపల పరిస్థితులు వేరేలా ఉంటాయి.. ఇప్పుడు నేను నీకు రెడ్ ఇస్తాను అని బిందు మాధవి అంటుంది. నువ్వెంతో సాధించావ్.. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో.. గ్రీన్ ఇస్తా అంటాడు అభిజిత్. అందర్ క్యా హై.. అది బయటకు రావాలి.చ. క్యూరిసిటీ మాక్కూడా ఉంది.. అని గ్రీన్ ఇస్తాడు నవదీప్. అలా ఆమెని హోల్డోలో పెట్టేశాడు. పంతులు వేషంలో అయ్యప్ప సాదు వస్తాడు. తర్వాత రెమోలా స్టైలీష్‌గా వస్తాడు. పంతులుకి ఇలాంటి వేషాలు అవసరమా? అని అంతా అనేవారు.. కానీ నేను దాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నా.. పంతులు అన్నీ చేయగలడని నిరూపించాలని అనుకుంటున్నా అని తన స్టోరీని చెబుతాడు.డ్యాన్స్ చేయమని ఓ టాస్క్ ఇస్తాడు. జిగేలు రాణికి ఓ మోస్తరుగా స్టెప్పులు వేస్తాడు. కానీ అది అంత ఎంటర్టైనింగ్గా ఉండదు. ఇది నీకు కరెక్ట్ ప్లేస్ కాదు.. అని అభిజిత్ రెడ్ ఇస్తాడు. ఈ స్టేజ్ వరకు వచ్చావ్ కదా చాలు.. నువ్వు ఆ ఇంట్లో ఇంప్రెస్ చేయలేవు.. అని బిందు కూడా రెడ్ ఇస్తుంది. ఇక్కడ చాలా యావరేజ్‌గా ఉంది.. పంతులు అనేది అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నావ్.. అని నాకు అనుమానంగా ఉంది.. అందుకే రెడ్ ఇస్తున్నా అని నవదీప్ అంటాడు. మీరు నన్నే వద్దని అనుకుంటున్నారు.. నా కంటే బెస్ట్ ఎవరు దొరుకుతారు అని అతను అంటే.. మేం వెతుకుతాం లే నువ్వు వెళ్లు అన్నట్టుగా కౌంటర్ వేస్తాడు నవదీప్.ఆ తర్వాత వైజాగ్ నుంచి డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ నడుపుతున్నా అని అపర్ణ వస్తుంది. ఆమె ఏదో కొన్నేళ్ల నుంచి నడుపుతున్నట్టుగా, వేల మందిని ట్రైనింగ్ చేసినట్టుగా చెబుతుంది. ఇది పెట్టి ఎన్నేళ్లు అవుతుంది అంటే ఆరు నెలలే అని చెబుతుంది. మరి అక్కడ నిరూపించుకోక ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మీరు ఫేమస్ అవ్వాలని మాత్రమే వచ్చారా? అని అడుగుతారు. నా ట్రైనింగ్ సెంటర్ గురించి అందరికీ తెలియాలని అనుకుంటున్నా అని అంటుంది. అలా అయితే మేం నీ సెంటర్ గురించి మా ఇన్ స్టాలో పోస్ట్ వేస్తాం ఓకే అని రెడ్ ఇచ్చి పంపించేస్తారు. ఇక వెళ్తూ వెళ్తూ ఆమె బోరున ఏడ్చేస్తుంది.బిగ్ బాస్ కప్ కొట్టాలని, అందరికీ స్పూర్తిగా ఉండాలని అనుకున్నా అని వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. నువ్వు ఇంత ఎమోషనల్‌గా వీక్ ఉంటే ఎలా కప్ గెలుస్తావ్? ఇలా అయితే ఎలా స్పూర్తిగా ఉంటావ్.. నువ్వు వీక్ అని ఇక్కడే తెలిసిపోతోంది కదా అని పంపించేస్తారు. మోటివేషనల్ స్పీకర్ అని ఇన్ స్టాలో రీల్స్ చేస్తానని రామకృష్ణ అనే ఓ వ్యక్తి వస్తాడు. ఫిజికల్‌గా కాస్త ఫిట్‌గానే ఉంటాడు. కానీ మోటివేట్ చేయమని నవదీప్ అవకాశం ఇస్తే.. చేయలేకపోతాడు. దీంతో ఫిజికల్ కేటగిరీలో చూసి అభిజిత్ మాత్రమే గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెడతాడు.





