బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ శనివారం నాడు లాంచ్ అయింది. టీవీల్లో రాత్రి ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ జియో హాట్ స్టార్‌లో ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో పది మంది కంటెస్టెంట్లను పిలిచారు. ఇందులో ఒక్కడికి మాత్రమే మూడు గ్రీన్స్ వచ్చాయి. షాలిని దామెరకి, సింగర్ ఝాన్సీకి రెండేసి గ్రీన్ ఓట్లు వచ్చాయి. ఇక వారిని హోల్డ్‌లో పెట్టారు. అభి సాంగర్, అంజలి, అర్జున్, శ్రీవాణి, దెబోరా, రన్నింగ్ రాజా అంటూ ఇలా కొంత మంది వచ్చారు. కానీ వారు ఏ మాత్రం జడ్జ్‌లను ఇంప్రెస్ చేయలేకపోయారు. అందుకే వారికి మూడు రెడ్ ఫ్లాగ్స్ చూపించి రిజెక్ట్ చేసేశారు.కరీంనగర్‌కు చెందిన షాలినీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుందట. బిగ్ బాస్ కోసం మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిందట. గతంలో ఒక రిలేషన్ ఉండేదని, ఇద్దరికీ సెట్ కావడం లేదని పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని చెప్పింది. నీ ఫోన్‌ని మేం చెక్ చేయొచ్చా? అని బిందు అడుగుతుంది. సరే కానీ స్నాప్ చాట్ మాత్రం చూడొద్దు, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది కదా.. నేను కూడా మీలానే మీ ఫోన్ చూస్తానంటే ఒప్పుకుంటారా? అని రివర్స్‌లో అడుగుతుంది. అవునా సరే అయితే మీ ఫోన్‌ను పగలగొట్టండి అని నవదీప్ అంటాడు. ఇక ఆమె ఆ ఫోన్‌ను పగలగొడుతుంది.వాష్ రూం క్లీన్ చేయడం నచ్చదు అని అప్లికేషన్లో ఉంది కదా.. ఇప్పుడు షూ క్లీన్ చేయండి అని టాస్క్ ఇస్తారు. షూని అయిష్టంగానే క్లీన్ చేస్తుంటుంది షాలిని. అంతలో ఇంకో కంటెస్టెంట్ అభి సాంగర్‌ను శ్రీముఖి పిలుస్తుంది. ఎంట్రీలోనే అతడ్ని రోస్ట్ చేసేస్తుంది శ్రీముఖి. 23 ఏళ్లు అని చెప్పడం, బిజినెస్ మెన్, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పడం ఇవన్నీ కూడా జడ్జ్‌లకు ఎక్కదు. సరే ఆ షాలినీ అవుట్ ఫిట్ ఎలా ఉంది.. ఆమె ఎలా ఉంది చెప్పు అని టాస్క్ ఇస్తారు. ఆమెకి పదికి ఏడు మార్కులు ఇస్తా.. ఓవర్ మేకప్, లిప్ స్టిక్, ఆ నెక్లెస్ బాగా లేదు అంటూ చెప్తాడు. నువ్వు అతడికి ఎన్ని మార్కులు ఇస్తావ్ షాలినీ అని అడుగుతారు. పాయింట్ 5 ఇస్తా అని కౌంటర్ వేస్తుంది షాలిని.రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నావ్ కదా.. ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయో చెప్పు అని అభిజిత్ అడుగుతాడు. పది వేలు అని అభి సాంగర్ అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. సరే ఇక నువ్వు వెళ్లు అని అందరూ రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తారు. షాలిని చివరకు షూస్ క్లీన్ చేస్తుంది. అప్పటికే బిందు అయితే రెడ్ ఇచ్చేస్తుంది. కానీ అభిజిత్, నవదీప్ మాత్రం గ్రీన్ ఇస్తారు. పైగా అభిజిత్ ఆమె చెప్పుల్ని క్లీన్ చేస్తాడు కూడా. అభిజిత్ అంటే తనకు బిగ్ బాస్ షో నుంచి ఇష్టమని, ఐ లవ్యూ అని చెప్పేస్తుంది. ఈ ఇద్దరికీ పెళ్లి చేసేద్దామా? అని శ్రీముఖి, బిందు ఆట పట్టిస్తుంటారు. నేను ఓకే అని షాలిని అంటుంది.ఆ తర్వాత సింగర్ ఝాన్సీని ప్రవేశ పెడతారు. సూర్యాపేట నుంచి వచ్చాను.. ఇంటర్లో 926 వచ్చాయి.. చదువుతూ, పొలం పనులు చేసుకుంటూ ఉంటాను.. జానపదాలు పాడుతూ ఉంటాను.. నా రీల్స్, వీడియోలతో కొంత మంది అయినా స్పూర్తి పొంది వ్యవసాయం చేస్తారని ఆశిస్తాను అని అంటుంది ఝాన్సీ. నీ కథ నాకు నచ్చింది.. నిన్ను ఇప్పుడే ఫాలో అవుతాను అని నవదీప్ అంటాడు. ఇన్ స్టాలో ఆమెని ఫాలో కొట్టేస్తాడు. అలా నవదీప్, బిందు గ్రీన్ ఇస్తారు. అయితే నిన్ను ఇంకా సానబెట్టాల్సింది ఉంది.. ఇది పాజిటివ్‌గా తీసుకో అని అభిజిత్ రెడ్ ఇస్తాడు.





