
ఉత్తరాంధ్ర మణిహారం అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ రేపే తన కార్యాకలాపాలను ప్రారంభించనుంది. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ అన్ని విధాలా ఆపరేషన్స్ కు సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత ముఖ్యమైన భద్రతకు CISFరంగంలోకి దిగింది.CISF భద్రతలో భోగాపురం ఎయిర్ పోర్ట్భోగాపురం విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రతా బాధ్యతలను అధికారికంగా చేపట్టింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డీఐజీ డాక్టర్ ఎంజి. రాఘవేంద్ర కుమార్ మాట్లాడుతూ, విమానాశ్రయంలో పూర్తి సురక్షితమైన, నమ్మదగిన, ప్రయాణికులకు అనుకూలమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. విమాన యాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఆపరేషన్స్ జరిగేలా CISF సమన్వయంవిమానయాన భద్రత రంగంలో సీఐఎస్ఎఫ్‌కు ఉన్న విస్తృత అనుభవంతో అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జీవీఐఏఎల్ యాజమాన్యం, వివిధ విమానయాన సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేసి విమానాశ్రయ కార్యకలాపాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నిర్వహిస్తామని డీఐజీ పేర్కొన్నారు.నేడు అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం విమానాశ్రయ సేవలు రద్దుభద్రతతో పాటు ప్రయాణికుల సౌకర్యాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ క్రమంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కూడా ఈ విమానాశ్రయంలో ఘనంగా నిర్వహించారు.ఇదిలా ఉండగా, భోగాపురం నుంచి వాణిజ్య విమాన సేవలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. నేడు అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం విమానాశ్రయ సేవలు రద్దు కానుండగా, అన్ని విమానాలు భోగాపురం నుంచి నడవనున్నాయి.తొలుత సర్వీసులు ఈ సంస్థ నుండేఇండిగో సంస్థ తొలుత సేవలు ప్రారంభించనుంది. ఆగస్టు 17న హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి వంటి నగరాలకు మొత్తం 31 సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. భోగాపురం నుంచి హైదరాబాద్‌కు ఉదయం నుంచి రాత్రి వరకు పలు విమానాలు, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, తిరుపతికి కూడా నిర్దిష్ట సమయాల్లో సేవలు ఉంటాయి.భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పై బెస్ట్ తెలుగు స్లోగన్స్ ఇవే.. ఇద్దరికీ చెరొక లక్ష రూపాయలు!భద్రత విషయంలో బేఫికర్ గా, హ్యాపీగాఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున ఉత్తరాంధ్ర వాసులు తొలిరోజు భోగాపురం విమానాశ్రయం నుండి విమాన యానం చేసి మరచిపోలేని తీపి జ్ఞాపకంగా మార్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. భద్రత విషయంలో బే ఫికర్ గా, అన్ని హంగుల అందాల విమానాశ్రయంలో ఆనందాల ప్రయాణం చెయ్యండి.





