వామ్మో.. ఇంటింటి రామాయణం సీరియల్లో ప్రేమ మామూలుగా పొంగటం లేదు. అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉంటే ప్రేమని తెగ పొంగిచేస్తారు.. లేదంటే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. పల్లవి మారిన తరువాత ఆమెపై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. అవని, మీనాక్షి, పార్వతి, శ్రియ, భానుమతి, చక్రధర్.. వీళ్లంతా ప్రేమ కురిపించడంలో తెగ పోటీపడుతున్నారు. అయితే చూసి చూసి పల్లవి అందర్నీ మడతపెట్టేసే రోజు దగ్గర్లోనే కనిపిస్తుంది కానీ.. ఈరోజు (ఆగస్టు 21) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. శ్రియ, మీనాక్షిలు తెగ ప్రేమ కురిపించుకుంటారు. ఒకర్నొకరు పట్టుకుని తెగ ఎమోషనల్ అయిపోతారు. సొంత అనుకోవడానికి రక్త సంబంధాలే ఉండాల్సిన అవసరం లేదు శ్రియ.. ప్రేమ పంచితే మామూలు సంబంధాలే అనుబంధాలు బలపడతాయి అంటూ శ్రియని పట్టుకుని తెగ ఏడ్చేస్తుంది మీనాక్షి.ఇక ఊ అంటే చాలు పార్వతి.. అవని భజన చేస్తూ ఉంటుంది కదా.. అది చూసీ చూసి భానుమతి ఒళ్లు మండింది. ‘ఈ ఇంట్లో అవని ఒక్కతే మనిషా.. మిగిలిన వాళ్లెవ్వరూ మనుషులు కాదా? ఊ అంటే చాలు అన్నింటికీ అవనే అంటావ్ ఏంటీ’ అంటూ దులిపేస్తుంది భానుమతి. ఆ తరువాత పల్లవి.. ఏదో బిజినెస్ చేయాలని అనుకుంటుంది కదా.. ఏం చేస్తుందో అడగొచ్చు కదా అని అంటుంది భానుమతి. అంతా అవని చూసుకుంటుంది అని పార్వతి అనడంతో.. ఇంకా మండిపోతుంది భానుమతికి. ఇంతలో పల్లవికి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది మీనాక్షి. ఇది కాఫీలా లేదు.. అమ్మ ప్రేమలా చాలా బావుంది అని తెగ పొగిడేస్తుంది పల్లవి. వీళ్లిద్దరి మధ్య నాటకీయం మామూలుగా లేదు. ఆపండి తల్లో చూడలేక చేస్తున్నాం అనేట్టుగానే ఉంది.మరో వైపు జైల్లో ఉన్న అశ్విన్ పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్ఐ వచ్చి.. అశ్విన్‌ని అవమానిస్తూ మాట్లాడతాడు. ‘ఆడదాని మాటల్ని నమ్మి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు.. ఆ పల్లవికి నాకు మధ్య అసలు స్టోరీ ఏంటనేది నీకు తెలియదు ఎస్ఐ’ అని అంటాడు అశ్విన్. ఏంట్రా నీకు అంటున్నావ్.. మీకు అనాలి.. నీ పిట్ట కథలు నా దగ్గర కాదు అని అంటాడు ఎస్ఐ. ఇంతలో అశ్విన్ స్నేహితుడు వచ్చి అరెస్ట్‌పై ఆరా తీస్తాడు.దాంతో పల్లవి చేసిన మోసాన్ని స్నేహితుడికి చెప్తాడు అశ్విన్. ‘ఆ పల్లవి చాలా తెలివిగా ప్లాన్ చేసిందిరా.. పోలీసులు అరెస్ట్ చేసేట్టు చేసిందిరా’ అని అంటాడు అశ్విన్. దానిపై పగ తీర్చుకుంటానన్నావ్.. డబ్బులు కూడా వస్తాయ్ అన్నావ్ ఏమైంద్రా అని అడుగుతాడు స్నేహితుడు. పల్లవి ఇంత గేమ్ ఆడుతుందని అనుకోలేదురా.. నేను అడిగిన డబ్బు ఇస్తానని ఒక స్పాట్‌కి రమ్మంది. కానీ అది వాళ్ల అక్క అవనితో కలిపి వచ్చింది. ఇద్దరూ కలిసి.. స్కెచ్ వేసి అరెస్ట్ చేయించారు. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చారు. డబ్బులు నా చేతికి ఇవ్వగానే.. ఎవడో వచ్చి లాక్కుని వెళ్లిపోయాడు. అది కూడా పల్లవి ప్లానే అయ్యి ఉంటుంది. అసలు వాడెవడో కనుక్కో.. లొకేషన్ మొత్తం జల్లెడ పట్టు’ అని స్నేహితుడికి చెప్తాడు అశ్విన్.ఇక అవని అయితే ఖాళీగా ఉండదు కదా.. ఇంట్లో పూజ అంటూ పల్లవిని పిలిచి.. దేవుడి పటాలను అలంకరించమని చెప్తుంది. ఇక అక్షయ్ ఆఫీస్‌కి బయల్దేరుతూ.. కమల్ని కూడా పిలుస్తాడు. తప్పదా అన్నయ్యా అని కమల్ అంటే.. ‘రావాల్సిందే’ అని అంటాడు అక్షయ్. ఆరాధ్యకి స్కూల్‌కి వెళ్లబుద్ది కాదు.. నీకేమో ఆఫీస్‌కి వెళ్లబుద్ది కాదు అని అంటుంది అవని. ఇంతకీ లంచ్ బాక్స్‌లో ఏం చేశావ్ వదినా అని కమల్ అంటే.. ‘తినడానికి ఏం చేశావ్ అంటావ్ కానీ.. ఆఫీస్‌లో వర్క్ ఏంటని మాత్రం అడగవు’ అని చురకలు వేస్తాడు అక్షయ్.ఇక పల్లవికి పూజ సామాన్లు క్లీన్ చేస్తుంటే.. మీనాక్షి వెళ్లి.. అయ్యో నువ్వు ఈ పనులు చేస్తున్నావ్ ఏంటీ.. నేను చూసుకుంటా అంటూ అడ్డుపడుతుంది. ‘నేను చేస్తాను.. ఏం పర్లేదు’ అని అంటుంది పల్లవి. ఇక తనకి వచ్చినట్టు చేస్తుంటే.. దాన్ని ఇలా తోమాలీ.. అలా కడగాలి అంటూ చింతపండు సలహాలు ఇస్తుంది మీనాక్షి. ఇక పల్లవిలో వచ్చిన మార్పుని నమ్మలేక దండాలుపెట్టేస్తుంటుంది భానుమతి. ఇక మీనాక్షి గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. అబ్బా చింతపండు రసం కళ్లలో పడింది అని పల్లవి అనగానే.. ఏదీ చూడనియ్’ అంటూ మీనాక్షి చేస్తుందయ్యా యాక్టింగూ.. వామ్మోమామూలుగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వీళ్ల ప్రేమ తగలెయ్యా అనేట్టుగానే ఉంటుంది. మొత్తానికి అలా నాటకీయాలతో ముగిసింది నేటి ఎపిసోడ్.




