
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. విద్వేష ప్రసంగం కేసులో సమన్లను ధిక్కరించినందుకుగానూ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కోర్టు ఈమేరకు చర్యలు తీసుకుంది. ఈ అరెస్టు వారెంట్ అమలుకు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
మహిళలను అవమానించారని, విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై మహువా మొయిత్రాపై గతంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కృష్ణానగర్ కోర్టు ఆమెకు పలుమార్లు సమన్లు జారీ చేసింది. బుధవారం కోర్టుకు హాజరు కావాలని ఇటీవల మరోసారి ఆదేశించింది. అయినప్పటికీ.. ఆమె హాజరు కాలేదు. పదేపదే సమన్లు జారీ చేసినప్పటికీ.. ఆమె గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
కుటుంబం గురించే ఎక్కువ చెప్పా కానీ..: సోనియా గాంధీ
‘‘కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడం.. ఆమె నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోంది. దీంతో అరెస్టు వారెంట్ జారీ చేయడం తప్ప కోర్టుకు వేరే మార్గం లేకపోయింది. మొయిత్రా కోర్టుకు హాజరవ్వరని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. దీనిని బట్టి ఆమెకు న్యాయస్థానంపై గౌరవం లేదని స్పష్టమవుతోంది’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
చండీగఢ్‌లో వర్ష బీభత్సానికి నగరంలోని ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్ ధ్వంసమైంది.
పంజాబ్‌లోని లూధియానాలో కాల్పులు కలకలం సృష్టించాయి.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మంచి నీటి పైప్‌లైన్ పరీక్ష నిర్వహించగా రోడ్డు కుంగిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో చోటుచేసుకుంది.





