
Apple iPhone 17 : ఆపిల్ గత ఏడాదిలో భారత మార్కెట్లో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐఫోన్ సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. మీరు ఐఫోన్ 17 కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లతో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 17 డీల్స్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 17 ధర, ఆఫర్లు : 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 80,900గా ఉంది. అయితే, గత ఏడాదిలో రూ. 82,900కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల (Apple iPhone 17) విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 5,955 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 74,955 అవుతుంది.
అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 57,250 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఎక్స్ఛేంజ్ డివైజ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే సుమారు రూ. 7,945 తగ్గింపుతో లభిస్తుంది.
Read Also : SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్‌డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే?
ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ ఐఫోన్ మోడల్ 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ iOS 26పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ఎమర్జెన్సీ SOS క్రాష్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, సింగిల్ USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. కొలతల పరంగా, ఐఫోన్ 17 మోడల్ 71.5 మిమీ వెడల్పు, 149.6 మిమీ ఎత్తు, 7.95 మిమీ డీప్, 177 గ్రాముల బరువు ఉంటుంది.