ఎప్పుడూ గొడవపడుతుంటే ‘’పాము, ముంగీసల్లా గొడవపడతారేంట్రా'' అంటుంటారు. అంటే బద్ద శత్రుత్వానికి ఈ రెండు జంతువులు సింబాలిక్ గా మారిపోయాయన్నమాట. మనకు పాము కనిపించిందంటే భయంతో దూరం పారిపోతాం… కానీ ముంగీస అలా కాదు, విషపూరితమైన పాముతో హోరాహోరీగా తలపడుతుంది. ఇలా ముంగీస, పాము ఎదురుపడితే చాలు అక్కడ యుద్ధం ఖాయం. మనం చిన్నప్పటి నుంచి పాము, ముంగీస శత్రుత్వం గురించి కథలుకథలుగా వింటూనే ఉన్నాం. ఈ సమయంలో ఓ డౌట్ వచ్చివుంటుంది… అసలు ఈ రెండింటి మధ్య ఇంత పగ ఎందుకని. దీని వెనుక పౌరాణిక, శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. పురాణాల ప్రకారం… కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. కద్రువ పాములకు తల్లి కాగా, వినత గరుత్మంతుడు, అరుణుడికి తల్లి. కద్రువకు వినత అంటే అస్సలు పడేది కాదు. ఒకసారి వారిద్దరి మధ్య జరిగిన పందెంలో కద్రువ మోసం చేసి వినతను ఓడించింది, తన దాసిగా మార్చుకుంది. ఈ మోసం గురించి తెలుసుకున్న వినత పాములకు శాపం పెట్టింది. అప్పటి నుంచి వినత కొడుకైన గరుత్మంతుడు పాములను చంపి తినడం మొదలుపెట్టాడు. ఇలా గరుడ జాతి పక్షులకు, పాములకు మధ్య వైరం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. విశేషం ఏంటంటే ముంగిసను 'నేల గరుడ' (Terrestrial Garuda) అని కూడా పిలుస్తారు. గరుత్మంతుడు ఆకాశంలో పాములను వేటాడితే, ముంగిస నేల మీద పాములను వేటాడి చంపుతుందని ఒక పౌరాణిక నమ్మకం. ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే పాము, ముంగిస రెండూ ఒకే రకమైన ఆహారం (చిన్నచిన్న జంతువులు, ఎలుకలు మొదలైనవి) తింటాయి. సాధారణంగా ఆహారం కోసం వేటాడేటప్పుడే ఇవి ఎక్కువగా ఎదురుపడతాయి. తమ ఆహారంపై మరొకరు హక్కు సాధించకూడదనే పోటీతోనే వీటి మధ్య పోరాటం జరుగుతుందని చెబుతారు. అంటే పరిస్థితులే వీటిమధ్య శత్రుత్వాన్ని పెంచాయన్నమాట. పాము విషం ముంగిసపై





