
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తున్నట్లుగా రాజీనామా లేఖను సోషల్ మీడియాను పోస్టు చేశారు. ఈ వ్యంగ్య లేఖ ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన గిరిజన పిల్లల తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లిన దీప్కేను, బాలాఘాట్‌లో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అడ్డగించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీప్కే ఆదివారం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






