
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతూ, భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి తర్వాత ప్రారంభమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారిగా ఇక్కడి రన్‌వేపై అడుగుపెట్టనుంది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది.విమానాశ్రయ ప్రారంభోత్సవంలో భాగంగా తొలి విమానంగా ఇండిగోకు చెందిన 6E6408 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 6:45 గంటలకు భోగాపురంలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే, ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన IX2064 విమానం కూడా ఇక్కడికి చేరుకుంటుంది. ఈ రెండు విమానాల రాకతో భోగాపురం ఎయిర్పోర్ట్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభంమవుతాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు చెక్-ఇన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం, తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేసి, ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోనున్నారు. తొలి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక రీతిలో స్వాగతం పలకనున్నారు. వారికి స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్-ఫ్లైట్ సర్టిఫికెట్లతో కూడిన గూడీ బ్యాగ్‌లను కానుకలుగా అందజేయనున్నారు.ఇదిలా ఉండగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 20 వరకు హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు భద్రతా





